35.9 C
India
Wednesday, May 1, 2024
More

    Nani Remuneration : నాని ఒక్క సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నాడో తెలుసా..?

    Date:

    Nani remuneration
    Nani remuneration

    Nani Remuneration : న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారు లేరు.. ఈయన సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. నాని గత సినిమా దసరాతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు.. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని కంటిన్యూ చేసేలా ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ నాని కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు. ఇంతకు ముందులా వరుసపెట్టి సినిమాలు చేయడం లేదు..

    దసరా విజయం సాధించిన తర్వాత ఈయన స్టార్ డమ్ మరింత పెరిగింది.. పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా క్రేజ్ పెంచుకోవడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాపై భారీ హోప్స్ నెలకొన్నాయి. దీంతో ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడని టాక్.. దసరా తర్వాత ఈయన ”హాయ్ నాన్న” సినిమాను చేస్తున్నాడు.

    ఒక యంగ్ హీరో నాన్న పాత్ర చేయడం అది కూడా రెండవసారి పెద్ద సాహసం అనే చెప్పాలి.. కొత్త డైరెక్టర్ శౌర్యన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా అంచనాలు బాగా పెరిగాయి.. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

    ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని నెక్స్ట్ సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. వివేక్ ఆత్రేయతో నాని తన నెక్స్ట్ సినిమాను చేయనున్నాడు.. ఇప్పటికే ఈ కాంబోలో అంటే సుందరానికి సినిమా చేసారు.. అయితే ఇది యావరేజ్ గా నిలిచినప్పటికీ మళ్ళీ నాని తన నెక్స్ట్ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో పాటు మరో సినిమాను నాని చేయనున్నాడు.

    స్కంద నిర్మాతతో నాని సినిమా చేస్తున్నాడని శివ కార్తికేయన్ తో డాన్ సినిమాను తెరకెక్కించిన సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయనున్నాడట.. మరి ఈ సినిమాకు నాని ఏకంగా 25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. హాయ్ నాన్న సినిమాకు 22 కోట్లు అందుకున్న నాని ఈ సినిమాకు మరింత పెంచినట్టు తెలుస్తుంది. మొత్తానికి నాని కూడా స్టార్ హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నాడు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2023 Roundup : సెలబ్రిటీల పెళ్లిసందడి.. ఓ ఇంటివారైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్!

    2023 Roundup : ఈ ఏడాదిలో సెల్రబిటీలు చాలా మందే పెళ్లిపీటలు...

    Animal Movie Trailer : పవర్ ప్యాక్డ్ యానిమల్ ట్రైలర్.. ఇది కదా వయలెన్స్ అంటే.. 

    Animal Movie Trailer : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్టులో సందీప్ రెడ్డి...

    Mahesh babu : మహేష్ వైఖరితో తల పట్టుకుంటున్న నిర్మాతలు

    Mahesh babu : కొన్ని కండిషన్స్ వల్ల మహేష్ బాబు నిర్మాతలకకు తలనోప్పిగా...