సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్లి గురించి కామెంట్ చేసి సంచలనం సృష్టించింది. ఒంటరి మహిళగా ఎన్నాళ్ళు ఉంటాను ….. నాకు ఒక తోడు ఉంటే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. రెండో పెళ్లి చేసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది…… కానీ నాకు తగిన వాడు , నన్ను పూర్తిగా అర్ధం చేసుకునే వాడు దొరక్కపోతే మళ్ళీ సమస్య మొదటికొస్తుంది కదా ! అందుకే ఇలాగే ఉంటే బెటర్ అని ఫిక్స్ అయిపోయా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రగతి.
తమిళనాట ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రగతి ఓ హీరో వేధించడం వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా. అయితే భర్తతో వచ్చిన విభేదాలతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక అప్పటి నుండి తల్లి , అత్త పాత్రల్లో నటిస్తూ ఉంది.
మంచి ఫిజిక్ ఉంది కానీ ప్రగతికి మాత్రం పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు ఇంతవరకు లభించలేదు అనే చెప్పాలి. సినిమాల్లో తల్లి , అత్త పాత్రల్లో నటించే ఈ భామ రియల్ లైఫ్ లో మాత్రం రౌడీ గా ఉంటుంది. స్లీవ్ లెస్ జాకెట్ లు , మోడ్రన్ వేర్ లలో దర్శనం ఇస్తూ , జిమ్ లో కష్టపడుతూ కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలోనే రెండో పెళ్లి గురించి టాపిక్ రాగా పైవిధంగా స్పందించింది.