తెలుగు చిత్రాల్లో హీరోలకు హీరోయిన్ లకు అందమైన తల్లిగా నటించే వారు ఎవరంటే టక్కున చెప్పే పేరు ప్రగతి. సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించే ఈ భామ బయట మాత్రం చాలా గ్లామర్ గా , మోడ్రన్ గా ఉంటుంది. ఇక జిమ్ లో ఈ భామ చేసే కసరత్తులు చూసి షాక్ అవుతుంటారు కుర్రాళ్ళు. డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తోంది ప్రగతి.
తాజాగా ఈ భామ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత అంశాలను ప్రస్తావించింది. తనకు పెళ్లి అయి ఇద్దరు సంతానమని , అయితే భర్తతో కలిసి ఉండాలని చాలా ప్రయత్నం చేసానని , కానీ నాకు అతడికి పొసగకపోవడం వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని అంటోంది.
అయితే విడాకులు ఇచ్చినప్పటికీ తన ఇద్దరు పిల్లల బాధ్యత నేనే తీసుకున్నానని , వాళ్లను అన్ని విధాలా చూసుకొని ప్రయోజకులను చేసానని అంటోంది ప్రగతి. తమిళనాట ఓ స్టార్ హీరో నన్ను ఘోరంగా ఇబ్బంది పెట్టాడని , అందుకే అప్పట్లో హీరోయిన్ గా నటించడం మానేసి , సినిమాలకు కూడా దూరమయ్యానని …… పెళ్లి చేసుకున్నానని అంటోంది. నాకు పొగరు కాదు ఆత్మగౌరవం ఉందని అది కొందరు పొగరు అని అనుకుంటారని దానికి నేనెలా బాధ్యురాలిని అని ప్రశ్నిస్తోంది ప్రగతి.