36.9 C
India
Monday, May 6, 2024
More

    Star character Artist Pragathi : ఆ సమయంలో ఆ హీరో బాధపెట్టారు.. అందుకే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకున్నా..

    Date:

    Character Artist Pragathi
    Character Artist Pragathi

    Star character Artist Pragathi : స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది ప్రగతి. మోడ్రన్ గా ట్రెడీషన్ గా పాత్రను బట్టి కనిపిస్తారు ఆమె. చిన్న వయస్సులోనే తల్లి పాత్ర వేసి మెప్పించారు ఆమె. ‘బాబీ’ సినిమాలో మహేశ్ బాబు తల్లి పాత్ర పోషించారు ప్రగతి. అయితే, అప్పటికి ఆమె వయస్సు 30 సంవత్సరాల్లోపేనట. ప్రగతి హీరోయిన్ గా 90లలో నటించారు. తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించారు. తక్కువ వయస్సులోనే వివాహం చేసుకున్న ఆమె ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

    ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండస్ట్రీకి వస్తున్నారు. ఏది ఏమైనా తన మనసులో మాటను కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుుతారు ప్రగతి. తను హరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఒక హీరో, నిర్మాత వేధింంచేవాడట. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలి అనుకున్నారట. ఎవరితోనైనా నటిస్తాను కానీ ఆ హీరోతో మాత్రం చేయనని తెగేసి చెప్పింది. హీరో పేరు చెప్పని ప్రగతి ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

    తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు పెళ్లి చేసుకోవడమే అంటుంది. పాప పుట్టిన తర్వాత తక్కువ సమయంలోనే విడాకులు అయ్యాయని దీంతో మానసికంగా బాగా కుంగిపోయినట్లు చెప్పింది. ఇండస్ట్రీలోకి రాక ముందు టెలిఫోన్ బూత్, పిజ్జా షాపులలో కూడా పని చేసినట్లు చెప్పారు ప్రగతి. ఇక చిత్ర పరిశ్రమలోకి వచ్చాక స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు లభించింది. సింగిల్ మదర్ గా ఇబ్బందులు పడుతున్నానని, కానీ రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని చెప్పారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు ప్రగతి.

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ప్రగతి. పిక్స్ తో పాటు డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంటుంది. బాడీ ఫిట్ నెట్ కూడా బాగా కాపాడుకుంటుందట. అందుకే గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేస్తుంది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వారికి కూడా ఆమె ఘాటుగానే సమాధానం ఇస్తుంది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Pragathi : ఆ హీరో రాత్రంతా తనతో గడపమన్నాడు.. నటి ప్రగతి కామెంట్లు..!

    Actress Pragathi : కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు చాలామంది ఎదుర్కుంటున్న అతిపెద్ద...

    Pragathi Second Marriage : రెండోపెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రగతి.. ఇచ్చి పడేసిందిగా..!

    Pragathi Second Marriage : ఈ నడుమ సినీ సెలబ్రిటీల గురించి,...

    రెండో పెళ్లి పై ఆసక్తికర కామెంట్ చేసిన ప్రగతి

    సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్లి గురించి కామెంట్ చేసి సంచలనం...

    ACTRESS PRAGATHI: అందుకే విడాకులు ఇచ్చా : ప్రగతి

    తెలుగు చిత్రాల్లో హీరోలకు హీరోయిన్ లకు అందమైన తల్లిగా నటించే వారు...