
డల్లాస్ లో నందమూరి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య లొల్లి జరిగింది. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో అరెస్ట్ , పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. డిసెంబర్ 31 కావడంతో అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు సమావేశమయ్యారు. అయితే సహజంగానే తెలుగువాళ్లు పలువురు హీరోలను అభిమానిస్తుంటారు. ఇక ఇక్కడ సమావేశమైన వాళ్లలో నందమూరి బాలకృష్ణ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు.
డిసెంబర్ 31 కావడంతో రకరకాల బ్రాండ్ లతో కాస్త చిల్ కూడా అవుతుంటారు. ఆ సమయంలో మాటా మాటా పెరగడం సహజం దాంతో ఇరు వర్గాల మధ్య మాటల దూకుడు పెరిగింది. అది కాస్త వ్యక్తిగత దూషణకు దారి తీసింది. బాలయ్య ను , పవన్ కళ్యాణ్ ను కూడా విమర్శించుకునేంత వరకు వెళ్ళింది. ఇంకేముంది దాడుల వరకు వెళ్ళింది వ్యవహారం. ఇటీవలే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.
హీరోలమైన మేమంతా ఒక్కటే …….. ఏవో చిన్న చిన్న మనస్పర్థలు , అభిప్రాయబేధాలు ఉంటాయి తప్ప శత్రుత్వం మామధ్య ఉండదని …… మాలాగే అభిమానులు అందరూ కలిసి ఉండాలని పలు సందర్భాల్లో హీరోలు చెబుతూనే ఉంటారు. అయితే కొంతమంది అత్యుత్సాహం ఉన్న అభిమానుల వల్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాయి.