31 C
India
Monday, April 29, 2024
More

    pawan kalyan fans : పవన్ అభిమాని వీరంగం.. చేయికోసుకుని చాటుకున్న భక్తి

    Date:

    BRO movie
    BRO movie

    pawan kalyan fans  మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వేయి రకాలుగా ఉంటుందట. అభిమాను వెర్రితలలు వేస్తే దాని పర్యవసానం కూడా వేరే ఉంటుంది. మనకు అభిమాన హీరోలుంటారు. వారి కోసం మొదటి ఆటకే టికెట్ కొనుక్కుని సినిమా చూసే వారుంటారు. ఇంకా అభిమాన కథానాయకుడికి రక్తదానం చేసి తమ భక్తిని చాటేవారు కూడా ఉంటారు. కానీ తను అభిమానించే హీరో కోసం రక్తం చిందే అభిమానులు కూడా ఉండటం సహజమే.

    ప్రస్తుతం పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. ఇప్పుడు విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బ్రో సినిమా సక్సెస్ టాక్ అందుకుంటోంది. కలెక్షన్ల పర్వం కొనసాగిస్తోంది. దీంతో పవన్ అభిమానులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. ప్రత్యేకంగా చూస్తున్నారు. తమ అభిమాన హీరో నటించిన సినిమాను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

    అన్నమయ్య జిల్లాలో ఓ అభిమాని పవన్ పై అభిమానంతో బ్లేడుతో చేయి కోసుకున్నాడు. అది ఒకసారి కాదు పలుమార్లు అలా చేయడం వల్ల అతడి చేయి నుంచి రక్తం కారింది. అయినా లెక్క చేయకుండా అలాగే కోసుకుంటూ ఉన్నాడు. అందరు వారించినా వినలేదు. తన అభిమాన హీరో కోసం రక్తం ధారపోస్తానని చెబుతూ చేయి కోసుకోవడం గమనార్హం.

    పవన్ కల్యాణ్ పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ బ్రో పోస్టర్ ఎదుట బ్లేడుతో పలుమార్లు చేయి కోసుకున్నాడు. రక్తం కారుతున్నా లెక్కచేయలేదు. ఆయన కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ చెప్పడం చూసి అందరు అవాక్కయ్యారు. మదనపల్లిలో జరిగిన ఈ సంఘటన అందరిలో ఆశ్చర్యం కలిగించింది. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. నీ భక్తి పాడుగాను చేయికి గాయమైతే కోలుకోవడం కష్టం అని కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konatala met Pawan: పవన్ తో భేటి అయిన మాజీ మంత్రి కొణతాల

        హైదరాబాదులో జనసేన పార్టీ అధినేతతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ...

    Pawan & Mahesh : ఓజీలో మహేష్ .. గుంటూరు కారం కోసం పవన్.. ఈ వార్తల్లో నిజమెంత..?

    Pawan & Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల...

    Pawan & Mahesh Babu : ఒకరికొకరు పవన్, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్న అగ్రహీరోలు

    Pawan & Mahesh Babu : సినిమా పరిశ్రమలో అగ్రహీరోలంటే పవన్...