
పవర్ స్టార్ ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు అంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈయన ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్నాడు. గత ఎన్నికల సమయం లోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొంటూ ఈసారి గెలిపించమని ప్రజలను కోరుతున్నాడు.
పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర కారణంగా కొద్దిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక పవన్ వారాహి యాత్రలో అధికార పార్టీ నాయకులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.. అంతేకాదు తోటి హీరోలపై కూడా ఈయన చేస్తున్న కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ శుక్రవారం రోజు భీమవరంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు..
ఈ సభకు ఎప్పటి లానే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చారు.. గత 20 రోజులుగా పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లోనే పర్యటిస్తుండగా తాజాగా భీమవరంలో పర్యటించారు.. ఈ సభలో పవన్ ప్రభాస్ అభిమానుల మనసులను గెలుచుకున్నారు.. భీమవరం సభలో ఈయన మాట్లాడిన మాటలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 2015లో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ గురించి ఈయన ఇప్పుడు ప్రస్తావించారు..
ఆ సంఘటన ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఊహించని పరిణామానికి దారి తీసింది. దీని గురించే పవన్ మాట్లాడుతూ.. ఆ సంఘటన నాకు చాలా బాధ కలిగించింది.. ఎవరైనా పోస్టర్ చించేస్తే అక్కడితో వదిలేయాలి కానీ ఇంత పెద్ద గొడవ చేయకూడదు.. చిన్న సంఘటన పెద్దది చేసుకోకండీ.. మిమ్మల్ని ఈ విషయంలో చేతులెత్తి వేడుకుంటున్న అంటూ ఈయన చెప్పిన మాటలు ప్రభాస్ అభిమానుల మనసులను గెలుచుకున్నాయి..
భీమవరంలో ప్రభాస్ అభిమానులు ఎక్కువుగా ఉంటారు.. అలాగే మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉంటారు.. నా ఒక్క అభిమానులే నాకు సరిపోరు.. మొత్తం జనం నాకు కావాలి.. నాకు అందరి సపోర్ట్ కావాలి.. ఈసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అంటూ పవన్ ప్రజలకు, ఫ్యాన్స్ ను కోరుతున్నారు.