Roja -Sunny Leone ఏపీ మంత్రి రోజా గురించి తెలియని వారు లేరు.. ఈమె ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మంత్రిగా రాణిస్తుంది.. అయితే తాజాగా మంత్రి రోజా మరో వివాదంలో చిక్కుకుంది.. ఈ వివాదం ఇప్పుడు పెద్దదిగా మారి ఈమెకు తలనొప్పి తెచ్చింది.
రోజా అంటే ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ను కామెంట్ చేస్తూ మధ్యలో సన్నీలియోన్ ను తీసుకు వచ్చింది. దీంతో ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి..
పవన్ కళ్యాణ్ జగన్ మీద వారి ప్రభుత్వం మీద చాలా వ్యాఖ్యలు చేసారు.. వైఎస్ భారతమ్మ నువ్వు నీ భర్తకు సంస్కారం నేర్పించమ్మ లేదంటే నేను నేర్పిస్తాను అంటూ పవన్ జగన్ పై కామెంట్స్ చేసాడు. దీనిపై రోజా మాట్లాడుతూ.. ”పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ కు సంస్కారం నేర్పిస్తాడంట.. ఇది ఎలా ఉందంటే సన్నీలియోన్ వచ్చి వేదాలు పలికినట్టు ఉంటుంది”.. అంటూ కామెంట్స్ చేసింది..
ఈ వ్యాఖ్యలపై సన్నీలియోన్ మాట్లాడుతూ నేను ఒక పోర్న్ స్టార్ ను కానీ నా గతం గురించి నేను ఎప్పుడు పశ్చాత్తాప పడలేదు.. నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేస్తాను.. కానీ మీలా చేయలేదు.. మీకు నాకు ఉన్న తేడా ఏంటంటే నేని ఇండస్ట్రీని వదిలేసాను.. మీరు వదిలేయలేదు.. అంటూ ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది ప్రతిపక్షాలకు కూడా మంచి న్యూస్ అయ్యింది. దీంతో తెగ షేర్ చేస్తూ రోజాను మరింత బ్యాడ్ చేసే పనిలో ఉన్నారు.