
Jai Amaravati Protest : ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పాలన అస్తవ్యస్తంగా మారింది. రాజధాని విషయంలో ఇప్పటికి కూడా స్పష్టమైన వైఖరి అవలంభించడం లేదు. దీంతో మంత్రులకు నిరసన తగులుతోంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజాకు సైతం తిరుమలలో నిరసన సెగ తగలడం గమనార్హం. ఆమె దేవుడి దర్శనం చేసుకునే సమయంలో జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు ఆమె వెంట రావడం విశేషం.
మంత్రి రోజా శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవలు మేడమ్ జై అమరావతి అంటూ చెప్పాలని ఆమెపై ఒత్తిడి చేశారు. ఆమె నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మూడు రాజధానుల కోసం నిర్ణయం తీసుకుంటారని తెలియడంతో రోజాను అనుసరించారు. జై అమరావతి అంటూ నినదించారు. కానీ రోజా ఎలాంటి సమాధానం వారికి చెప్పలేదు.
రోజాకు నగరి నియోజకవర్గంలోనే అస్మదీయులు పెరుగుతున్నారు. అక్కడ ఆమె ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆమెకు ఈసారి టికెట్ ఇవ్వొద్దనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈనేపథ్యంలో రోజా రాజకీయ ప్రస్థానమే ప్రశ్నార్థకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో అధికార మార్పిడికి జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొందరు ఇన్ చార్జులను మార్చడంతో వారు ఇచ్చిన ఝలక్ కు తలొగ్గి మళ్లీ ఎక్కడి వారిని అక్కడే ఉంచే ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు. రాజకీయ పరిణామాలు ఎటు వైపు తిరుగుతాయో అర్థం కావడం లేదు.