నటసింహం నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బాలయ్య కు నోటి దూల బాగా అనే విషయం తెలిసిందే. నోటి దూల అంటే భోళా శంకరుడు లాంటి వాడు బాలయ్య. మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా లోపల అనుకునే మాట బయటకు అనేస్తాడు దాంతో పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాలు బాలయ్యను చుట్టుముట్టగా తాజాగా నర్స్ వివాదం బాలయ్య మెడకు చుట్టుకుంది.
అసలు విషయం ఏంటంటే ……. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అన్ స్టాపబుల్ షోలో ఇంటర్వ్యూ చేసాడు బాలయ్య. ఆ షోలో భాగంగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తావన వచ్చింది దాంతో బాగా ఎమోషనల్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఆమధ్య కాలంలో సాయిధరమ్ తేజ్ బైక్ పై స్పీడ్ గా వెళ్తూ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే.
అయితే ఆ ప్రస్తావన రావడంతో బాలయ్య కు తన యాక్సిడెంట్ విషయం గుర్తొచ్చింది. చాలాకాలం క్రితం …… బాలయ్య బైక్ మీద చాలా స్పీడ్ గా వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యిందట. ఒళ్ళంతా రక్తం దాంతో రోడ్ యాక్సిడెంట్ అంటే హాస్పిటల్ లో వైద్యం చేయరు అందుకే అలా చెప్పొద్దూ అని బాలయ్యకు ఫ్రెండ్స్ సలహా ఇచ్చారట. అయితే బాలయ్య మాత్రం రోడ్ యాక్సిడెంట్ అని నర్స్ కు చెప్పాడట ….. ఎందుకంటే దానమ్మో …… ఆ నర్స్ చాలా అందంగా ఉంది …. అలాంటి అందమైన నర్స్ అడిగితే అబద్దం ఎలా చెబుతామన్నది బాలయ్య ఉద్దేశం.
కానీ ఎంతో సేవ చేసే నర్స్ లను అసభ్య పదజాలంతో దూషిస్తావా ? వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నర్స్ ల సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం పై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.