32.6 C
India
Saturday, May 18, 2024
More

    Brahmaji : బ్రహ్మాజీ కామెంట్ కు ఏకిపారేసిన నెటిజన్లు

    Date:

    Brahmaji
    Brahmaji

    Brahmaji తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ. విలక్షణమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నాడు. గులాబీతో ప్రస్థానం ప్రారంభించి సిందూరంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించాడు. పాత్రలకు జీవం పోశాడు. బ్రహ్మాజీ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది.

    తన కొడుకు సంజయ్ రావు హీరోగా స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా తెరకెక్కుతోంది. ఈనెల 29న విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్లలో బ్రహ్మాజీ కూడా పాల్గొంటున్నాడు. ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు నీరంతా ఏరులై పారింది. ఈ సందర్భంలో బ్రహ్మాజీ కూడా కష్టాలు ఎదుర్కొన్నాడు. వర్షంలో చిక్కుకుపోయాడు. దీంతో సమస్య తీవ్రత గుర్తించి దగ్గరలో ఉన్న తెలిసిన వారింట్లో కారు పార్కు చేసి తన ఇంటికి చేరుకున్నాడు.

    నగరంలో నీళ్లను చూసి ఓ కామెంట్ పోస్టు చేశాడు. తాను ఓ బోటు కొనుక్కోవాలని అనుకుంటున్నానని నగర పరిస్థితిని గురించి ట్వీట్ చేశాడు. దీనిపై రకరకాల కామెంట్లు వచ్చాయి. అందరు బ్రహ్మాజీని తిడుతూ కామెంట్లు చేశారు. హైదరాబాద్ రెయిన్ అనే ట్యాగ్ కూడా జత చేయడంతో దారుణంగా ట్రోల్ చేశారు. ఆంధ్రోడా అంటూ తిడుతూ తెగ కామెంట్లు జత చేశారు.

    ఈ విషయంలో వివరణ ఇచ్చినప్పటికి కూడా తిట్లు ఆగలేదు. దీంతో కొంత కాలం ట్విట్టర్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇలా బ్రహ్మాజీ చేసిన కామెంట్ కు చాలా మంది స్పందించారు. బ్రహ్మాజీని ఏకిపారేశారు. దీంతో అతడు నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు. అతడు చేసిన దానికి చాలా రెట్లు వారు కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Brahmaji-Kumari Aunty : కుమారి ఆంటీ వీడియోపై బ్రహ్మాజీ స్పందన ఎలా ఉంటుందో?

    Brahmaji-Kumari Aunty : ప్రస్తుతం సామాన్యులు చేసే పనిని సెలబ్రిటీలు చేస్తున్నారు....

    prabhas : సలార్ క్లైమాక్స్ భిన్నంగా.. బ్రహ్మాజీ ఎంట్రీతో కథ మరో మలుపు

    prabhas యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్...

    ANASUYA- BRAHMAJI: అనసూయపై సెటైర్ వేసిన బ్రహ్మాజీ

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ హాట్ భామ అనసూయ పై సెటైర్ వేసాడు....