
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రేపే ప్రారంభం కానుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ తో చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. పవన్ కళ్యాణ్ ను మళ్లీ డైరెక్ట్ చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు హరీష్ శంకర్. గత రెండేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 11 న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ల సినిమా ప్రారంభం కానుంది.
అయితే రేపు కేవలం ప్రారంభం మాత్రమే. రెగ్యులర్ షూటింగ్ మాత్రం సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా పూర్తి అయ్యాక హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇదే సమయంలో సుజిత్ దర్శకత్వంలో కూడా మరో చిత్రంలో నటించనున్నాడు పవన్ కళ్యాణ్. ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే …… గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.