మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మాస్ మసాలా చిత్రం ” ధమాకా ”. ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైన ధమాకా మొదటి రోజున బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజున 10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. గతకొంత కాలంగా రవితేజ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. అయితే ధమాకా మాత్రం మొదటి రోజునే 10 కోట్ల గ్రాస్ ను 5 కోట్లకు పైగా షేర్ ను సాధించి సంచలనం సృష్టించింది.
నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం పోషించాడు. శ్రీ లీల గ్లామర్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఇక పక్కా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఓపెనింగ్స్ లభించాయి. దాంతో తప్పకుండా ధమాకా చిత్రం రవితేజ కెరీర్ లో మరో సూపర్ హిట్ పడినట్లే అని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.