31.6 C
India
Sunday, May 19, 2024
More

    పడుకునే ముందు ఇలా చేస్తే నిద్రలేమికి ‘చెక్’

    Date:

    sleeplessness
    sleeplessness
    21వ శతాబ్దంలో ప్రతి ఒక్కరి నోట వినబడే పదం ఒత్తిడి.. అసలు ఈ ఒత్తిడికి గురికావడానికి గల కారణాలేంటి..? దీనివల్ల జరిగే అనర్ధాలు ఏంటి.. దీన్ని ఎలా జయించాలి.. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి.. అనే దానిపై పూర్తిగా అవగాహన కలిగి ఉంటేనే నిద్రలేమి సమస్య కు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
     * నిద్రలేమికి గల కారణాలు..
     ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవనశైలి మారింది.. ఉద్యోగరీత్యా   నైట్ షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది.. దీంతో చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. ఎర్లీగా తినకపోవడం, ఎర్లీగా పడుకోకపోవడం ఎర్లీగా లేవకపోవడంతో అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడు తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం.
     * నిద్రలేమి వల్ల కలిగే అనర్ధాలు
     మనిషి  సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే  తప్పనిసరిగా 6 గంటలు నిద్ర అవసరం. ఆరు గంటలకంటే తక్కువ నిద్రపోతే.. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్,బీపీ  వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా  నిద్ర సరిగా లేకపోతే జీవక్రియ సరిగా జరగక అల్సర్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు  వస్తాయని పేర్కొంటున్నారు.
    * తేనెతో నిద్రలేమికి చెక్..
     తేనే నిద్రలేమి సమస్యకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని, అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను  కలిగిస్తుంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలో విటమిన్ ఏ, సి ల తో పాటు క్యాల్షియం ఇనుము లాంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. రాత్రుళ్ళు నిద్ర పట్టని వారు పడుకునే ముందు ఓ స్పూన్ తేనె తాగితే మెదడును శరీరాన్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా రాత్రుళ్లు తీసుకోవడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది.
    రాత్రి సమయంలో ఒక గ్లాసు నీళ్లలో చెంచా తేనె వేసుకొని తాగితే ఒత్తిడిని తగ్గించి మెదడు డిప్రెషన్ కు గురికాకుండా ఆపుతుంది. తేనెలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి అలాగే డయేరియాతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా  అల్సర్లు నొప్పులను తగ్గిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
    ఎర్లీగా పడుకొని లేవడంతో పాటు ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ లు, రాత్రిపూట జంక్ ఫుడ్ లు తినకుండా తేలికపాటి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తే నిద్రలేమి సమస్యను జయించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Best Way to Relieve Stress : ఒత్తిడిని దూరం చేసుకునే మార్గమేంటో తెలుసా?

    Best Way to Relieve Stress : మనిషికి తిండితో పాటు...

    Hours of sleep : ఏ వయసు వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం

    Hours of sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. ఒక...

    నిద్రలేమికి కారణాలేంటో తెలుసా?

    Causes of Insomnia : ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య అందరిని...

    Insomnia : నిద్రలేమి లక్షణాలేంటో తెలుసా?

    Insomnia : మనకు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....