29.5 C
India
Sunday, May 19, 2024
More

    Sarath Babu no more : శరత్ బాబు ఇకలేరు.. శోకసంద్రంలో టాలీవుడ్.. ఆయన నట ప్రస్థానం ఇదీ

    Date:

    Sarath Babu no more
    Sarath Babu no more, actor sarath babu

    Sarath Babu no more : అందానికి అందం.. రూపానికి రూపం.. శరీర సౌష్టవంలో అచ్చం స్టార్ హీరోలా ఉంటాడు. అందగాడు అయిన ప్రముఖ నటుడు శరత్ బాబు ఇక మన మధ్యలో లేరు.  తెలుగులో 1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో హీరోగా తొలిసారి వెండితెరపై మెరిశాడు శరత్ బాబు. రెండో సినిమాలో విలన్ గా నటించాడు. ఇప్పటివరకూ 250 చిత్రాల్లో నటించారు. హిందీ, తమిళ భాషలలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి లెజండరీ యాక్టర్ గా నిలిచాడు. ఆయన వెండితెర మీద చివరి సారిగా కనిపించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ .  ఈ సినిమాలో ఆయన బార్ కౌన్సిల్ మెంబెర్ గా కనిపించాడు.   ఇక నటించిన చివరి చిత్రం నరేశ్ హీరోగా వస్తోన్న ‘మళ్లీ పెళ్లి’.

    హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ భాషలలో కలిపి సుమారుగా 250 కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు గత కొంత కాలం క్రితం హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ లో  తీవ్రమైన అస్వస్థత కారణం అత్యవసర చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

    అయితే ఆయన ఇన్ని రోజులు మృత్యువుతో పోరాడి నేడు తన తుది శ్వాస ని విడిచినట్టు AIG హాస్పిటల్స్ డాక్టర్లు చెప్పుకొచ్చారు. ఇన్ఫెక్షన్ కారణం గా శరీరంలో ప్రధాన అవయవాలైన కాలేయం, ఊపిరి తిత్తులు , కిడ్నీ లు చెడిపోయాయని.కానీ అత్యవసర చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడని, ICU నుండి నార్మల్ వార్డు కి మార్చమని గతం లో డాక్టర్లు చెప్పుకొచ్చారు.

    ఇక శరత్ బాబు ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకునేలోపే కాసపటి క్రితమే ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారని, వెంటనే ICU వార్డు కి తరలించి వెంటిలేటర్ పై పడుకోపెట్టి చికిత్స చేసినా ఉపయోగం లేకుండా పోయిందని డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు. 71 సంవత్సరాల వయస్సున్న శరత్ బాబు రామరాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు.

    హీరోగా విలన్ గా, సహాయనటుడిగా సుమారు 250 చిత్రాల్లో నటించారు. ఇక బుల్లితెరపై ‘అంతరంగాలు’ సీరియల్ లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక నటి రమప్రభను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. శరత్ బాబు మృతికి టాలీవుడ్ సంతాపం తెలుపుతోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramaprabha : శరత్ బాబును కడసారి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రమాప్రభ.. ఇంకా ప్రేమ చావలేదంటూ.. 

    Ramaprabha : వెటరన్ నటుడు శరత్ బాబు నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.....

    Sarath Babu Last Desire : చివరి కోరిక తీరకుండానే మరణించిన శరత్ బాబు.. ఏంటంటే..?

    Sarath Babu last desire : 1951లో జన్మించిన శరత్ బాబు...

    Sarath Babu Death : నటుడు శరత్ బాబు మృతి.. ఇండస్ట్రీలో విషాదం!

      Sarath Babu Death : టాలీవుడ్ లో ఈ మధ్య వరుసగా విషాద...