29.5 C
India
Sunday, May 19, 2024
More

    Guntur Karam Teaser : గుంటూరు కారం టీజర్ రివ్యూ : కృష్ణ బర్త్ డే నాడు ఫ్యాన్స్ ‘కారం’ అంటించాడంతే?

    Date:

    Guntur Karam Teaser
    Guntur Karam Teaser

    Guntur Karam Teaser : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు స్పెషల్ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. #SSMB28 ఇప్పుడు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ టైటిల్‌కు ‘హైలీ ఇన్‌ఫ్లమబుల్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఓవరాల్ గా సినిమా పోస్టర్, వైబ్ మాస్ ఫీల్ ఇస్తాయి. ఈ సినిమా స్పెషల్ గ్లిమ్స్ పూర్తిగా మాస్ లోడెడ్ గా ఉంది. మహేశ్ బాబును సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నారు. గ్లింప్స్ లో మాస్ డైలాగ్ చెప్పాడు.

    సన్నకర్ర సవ్వా దెబ్బ.. బొడ్డురాయి బెండా దెబ్బ.. అంటూ సాగే ఈ పాటలో మహేశ్ బాబు ఫుల్ మాస్ గెలప్ లో కనిపిస్తాడు. కర్రను పట్టుకుని తిప్పుతూ ఆయన నడిచే విధానం మాస్ కే కేక పుట్టిస్తుంది. ఉయ్.. అంటూ వచ్చే కోరస్ ఈ పాటకు మరింత హైప్ ను తీసుకచ్చింది. సర్ర సర్ర సూరం సుర్రయితంది కారం.. అంటూ ఈ గ్లిమ్స్ ఆసాంతం మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఒక్క ఊపు ఊపిందనడంలో సందేహం లేదు. ఈ గ్లిమ్స్ లో మహేశ్ బాబు ‘బీడీ ఏమన్నా త్రీడీలో కనిపిస్తుందారా..’ అంటూ చెప్పిన డైలాగ్ గ్లిమ్స్ కే గూస్ బంప్స్ పుట్టిస్తోంది. ఏది ఏమైనా మహేశ్ బాబు ఊర మాస్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారంటే ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆనందంగా ఉన్నారు. ఇది మళ్లీ త్రివిక్రమ్ సినిమా కావడంతో మరింత సూపరనే చెప్పాలి.

    పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 13 జనవరి, 2024న విడుదల కానుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Guntur Karam : ‘గుంటూరు కారం’కు లైక్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?

    Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ రెండు...

    Mahesh Babu Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి విడుదల చేసేందకు ప్లాన్?

    Mahesh Babu Guntur Kaaram :మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్...

    “Guntur Karam” : బిగ్ షాక్.. ‘గుంటూరు కారం’ పూర్తిగా ఆగిపోయిందా.. సంచలన మ్యాటర్ లీక్..!

    "Guntur Karam" : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు...