31 C
India
Monday, May 20, 2024
More

    తనను చంపాలని చూస్తున్నారు.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..

    Date:

     

     


    They are trying to kill her.. Karate Kalyani’s sensational comments : ఏదో ఒక వివాదాన్ని ముందేసుకొని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది కరాటే కళ్యాణి. రీసెంట్ గా తనకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేసింది. కొందరు నన్ను చంపాలని చూస్తున్నారు, ఒక సారి తనపై హత్యాయత్నం కూడా జరిగిందని చెప్పారు. ఇటీవల కరాటే కళ్యాణి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇటీవల ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ నుంచి సస్పెషన్స్ కు గురైంది. ఖమ్మం, లకారం ట్యాంక్ బండ్ పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆమె ఖండించారు. ఈ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండడంతో యాదవ సంఘాలు దీని ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నాయి.

    ఈ విగ్రహ ఏర్పాటుపై మాట్లాడిన కళ్యాణిపై ‘మా’ సీరియస్ అయ్యింది. దీనిపై ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించారు. అయితే ఆమె వివరణ మా కు నచ్చకపోవడంతో సస్పెండ్ చేసింది. దీనిపై కళ్యాణి స్పందిస్తూ ‘నాకు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే సమయం కూడా ఇవ్వలేదు. 2, 3 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. నాకు తీవ్రమైన అనారోగ్యం కలగడంతో ఓ వ్యక్తితో సమాధానం పంపించాను. టాలీవుడ్ తరఫున అనేక సార్లు మాట్లాడాను. విమర్శలు ఎదుర్కొంటూ నాగళం వినిపించా. అందుకు ‘మా’ మంచి బహుమతే ఇచ్చింది’ అన్నారు.

    సస్పెన్షన్ తననుతీవ్ర మనోవేదనకు గురి చేసిందని కళ్యాణి చెప్పారు.. తాజాగా ఆమె తనపై హత్యాయత్నం జరిగినట్లు అరోపణలు చేసింది. నా కారు టైర్లను ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే కట్ చేశారు. నేను ప్రయాణం చేస్తున్న సమయంలో అవి పేలాయి. అదృష్ట వశాత్తు ఏమీ కాలేదు. టైర్లను పరిశీలించిన మెకానిక్ కావాలనే ఏవరో చేశారని చెప్పాడు. తనకు ప్రాణహానీ ఉందని ఆమె వెల్లడించింది.

    కరాటే కళ్యాణి కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఆమె జీవితం చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. గతేడాది ఓ యూ ట్యూబర్ ను ఆమె రోడ్డుపైనే కొట్టింది. పెద్ద న్యూసెన్స్ కావడంతో పోలీసులు కేసు పెట్టారు. సరైన అనుమతులు లేకుండా ఓ పాపను పెంచుతుందని అధికారులు కేసులు నమోదు చేశారు. అనంతరం ఆ పాప తల్లిదండ్రులతో కలిసి ఆమె ప్రెస్ మీట్ పెట్టడంతో సమస్య సద్దుమణిగింది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Karate Kalyani : మా సభ్యత్వం రద్దుపై కరాటే కల్యాణి ఆవేదన

    Karate Kalyani : సినిమా పరిశ్రమలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఒప్పుకోరు....

    Karate Kalyani : ఎన్టీఆర్ పై కరాటే కల్యాణీ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. ఈయన ఎవరికి దేవుడంటూ.. 

    Karate Kalyani : కరాటే కల్యాణీ ఈ మధ్య నిత్యం వార్తల్లో...

    Maa president : కరాటే కల్యాణీకి ‘మా’ అధ్యక్షుడు నోటీసులు.. ఎన్టీఆర్ విగ్రహ వివాదమే కారణమా?

    Maa president : ఖమ్మంలో పరిస్థితులు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయి.. ఎందుకంటే ఖమ్మం...

    Karate Kalyani : ’ఎన్టీఆర్ ఏమైనా శ్రీకృష్ణుడా.. విగ్రహావిష్కరణను అడ్డుకుంటా ’

    Karate Kalyani : మే 28న నందమూరి తారక రామారావు శత...