
Maa president : ఖమ్మంలో పరిస్థితులు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయి.. ఎందుకంటే ఖమ్మం లోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.. మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు..
ఈ క్రమంలోనే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పలువురు వ్యాపారవేత్తలు, కొంతమంది ఎన్నారైలు, తానా సభ్యులంతా ఆర్ధిక సహాయం చేసారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది.
ఈ విగ్రహం ఏర్పాటుపై కరాటీ కళ్యాణి ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. కృష్ణుడు రూపంలో విగ్రహం తయారు చేయడంపై అభ్యంతరం తెలుపుతున్నారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏంటని కొన్ని రోజులుగా చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఈ ఆవిష్కరణను అడ్డుకుంటామని పలువురు చెబుతున్నారు. ఈ వివాదంలో కరాటే కల్యాణీ చేసిన వ్యాఖ్యలపై విష్ణు ఆమెకు నోటీసులు పంపించారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించాలని నిర్ణయించారు.. మరి ఈ వేడుక ఎలాంటి సంఘటనల మధ్య ముగుస్తుందో వేచి చూడాలి..