
Karate Kalyani : సినిమా పరిశ్రమలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఒప్పుకోరు. భరించరు. వారిని అష్టకష్టాలు పెడుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో రెబల్ గా మారే నటి కరాటే కల్యాణి. ఆమె ఏం మాట్లాడినా వివాదాల్లో దూరడం సహజం. ఇప్పుడు కూడా మరో వివాదంలో ఇరుక్కుంది. దీంతో మా సభ్యత్వం నుంచి తొలగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది శ్రీ మహావిష్ణువు రూపంలో నిర్మించారు. దీంతో యాదవులు ఆక్షేపించారు. ఒక సినిమా నటుడిని దేవుడి రూపంలో ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కరాటే కల్యాణి కూడా స్పందించింది. సినిమా నటులను దేవుళ్ల రూపంలో చూపించడం తగదని హితవు పలికింది. దీని గురించి మాట్లాడినందుకు మా అసోసియేషన్ ఆమె సమాధానం చెప్పాలని నోటీసు జారీ చేసింది.
ఆరోగ్యం సహకరించకపోవడంతో కల్యాణి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మా అసోసియేషన్ ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజం మాట్లాడితే కూడా ఇలా వేధిస్తారా? అని వాపోయింది. తాను మా అసోసియేషన్ కు ఎంతో సేవ చేస్తే చివరికి ఇలాంటి ఫలితం ఇస్తారని అనుకోలేదని నివ్వెర పోతోంది.
ఎప్పుడు కూడా వివాదాల్లో ఉండే కల్యాణి మరోమారు ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. కానీ తాను ఎంత చేసినా ఇలా హీనంగా చూస్తారని అనుకోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణికి మా అసోసియేషన్ ఇంత భారీ శిక్ష వేస్తుందని అనుకోలేదని వాపోతోంది. దీనిపై ఇంకా భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు.