
Karate Kalyani : మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు.. ఖమ్మంలోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు..
ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పలువురు వ్యాపారవేత్తలు, కొంతమంది ఎన్నారైలు, తానా సభ్యులంతా ఆర్ధిక సహాయం చేసారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు.. ఇలాంటి విగ్రహం ఇప్పటి వరకు ఎక్కడ లేదని.. ఎన్టీఆర్ విగ్రహం ఇలా కృష్ణుడు ఆకారంలో లేదని ప్రత్యేకంగా తయారు చేయించారు..
అయితే తాజాగా ఈ విగ్రహం ఏర్పాటుపై కరాటీ కళ్యాణి ( Karate Kalyani ) ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అటువంటి గొప్ప నటుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. కానీ కృష్ణుడు విగ్రహం రూపంలో తయారు చేయడమే అభ్యంతరం అని తెలిపారు..
ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాను అని కరాటే కళ్యాణి వెల్లడించింది.. కేవలం ఓట్లు కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపించారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.. మరి ఈ వివాదం తర్వాత ఎన్టీఆర్ విగ్రహం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.