39 C
India
Sunday, May 19, 2024
More

    Minister Mallareddy : గొర్రెలు కాసిన మంత్రి మల్లారెడ్డి

    Date:

    Minister Mallareddy :

    మంత్రి మల్లారెడ్డి ఏది చేసినా సంచలనమే. తన మాటలతోనే కాదు చేతలతో కూడా ప్రజలను నవ్విస్తుంటాడు. తనదైన శైలిలో కమెడియన్ గా చేస్తుంటారు. ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి. తాను కష్టపడి పైకి వచ్చానటంటాడు. ఏం చేసి ఎదిగావంటే చెప్పరు. ఇలా పలుమార్లు సోషల్ మీడియాలో సందడి చేయడం ఆయనకు కొత్తేమీ కాదు.

    తాజాగా మేడ్చల్ జిల్లా గౌరవెల్లిలో గొర్రెల పెంపకందారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గొంగళి కోలాటం వేసుకుని కర్ర చేత పట్టుకుని కాసేపు గొల్ల కాపరి అవతారం ఎత్తాడు. నిజంగా గొల్లవాడిగా కనిపించాడు. దీంతో గొర్రెల కాపరులు కూడా నవ్వుకున్నారు. మంత్రి అచ్చం గొల్లవారిలా ఉన్నాడని తమలో తామే అనుకున్నారు.

    దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి గొర్రెల కాపరి అవతారం ఆకర్షించింది. గతంలో కూడా మంత్రి పలు రకాల వేషాలు వేశారు. నృత్యాలు కూడా చేశారు. అందుకే ఈయనను జోకర్ గా అభివర్ణిస్తుంటారు. తాను కష్టపడి పనిచేసి పైకొచ్చానని చెబుతుండటంతో ఓ మహిళ ఎలా పైకొచ్చావని అడిగితే చెప్పాను కదా కష్టపడి అని సమాధానం ఇచ్చాడు.

    ఏం కష్టం చేశావు అంటే చెప్పరు. కష్టపడి పని చేశానని మాత్రమే చెబుతారు. అలా మల్లారెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ తప్పించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం వ‌ృత్తిదారుల కోసమే ఉందని చెప్పారు. గొర్రెలతో లబ్ధి పొంది ఆర్థిక సమస్యల నుంచి దూరం కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం బీసీలకు కూడా సాయం చేస్తుందని భరోసా కల్పించారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    DK Aruna : డీకే అరుణ దారెటు.. హస్తం వైపేనా..?

    DK Aruna : బీజేపీలో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి...

    Telangana EC’s key statement : తెలంగాణలో ఎన్నికలు.. నగదు తరలింపుపై ఈసీ కీలక ప్రకటన

    Telangana EC's key statement : తెలంగాణలో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్...