Undavalli’s Knowledge : ఏపీలో ఒక వినూత్న లీడర్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ కు పేరుంది. ఆయన రాజకీయాల్లో పోటీకి దూరంగా ఉంటూనే, క్రియాశీలక విషయాల్లో ముందుంటున్నారు. ఇప్పటికే ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీరావు మీద వివిధ కేసులు వేశారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుంటారు. ఇటీవల ఆయన వైసీపీ అధినేత జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టాక్ సంపాదించుకున్నారు.
అయిత ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన విషయాలు ఉండవల్లిపై సెటైర్లకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇక బిల్ గేట్స్ ఎవరంటే.. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద టైప్ మిషన్స్ కంపెనీ ఓనర్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక సత్య నాదెళ్ల ఆ కంపెనీలో పని చేస్తున్న హైయస్ట్ పెయిడ్ టైపిస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియోను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఉండవల్లి గారికి విషయ పరిజ్ఞానం బాగుదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక సార్ ఏది చెప్పినా కరెక్టే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పరిస్థితి ఏంటో అని సెటైర్లు వేస్తున్నారు.