34.1 C
India
Saturday, May 18, 2024
More

    Bro Movie Review: ‘బ్రో’ సినిమా రివ్యూ.. పవన్, సాయితేజ్ హిట్ కొట్టారా..?

    Date:

    Bro Movie Review
    Bro Movie Review
    Bro Movie Review పవన్ కల్యాణ్‌ ఇప్పుడు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. ఇక మధ్యలో సినిమాలను కూడా కంప్లీట్ చేస్తున్నాడు. తక్కువ సమయంలో తెరకెక్కిన రీమేక్ మూవీ బ్రో ది అవతార్. ఇందులో పవన్ తో పాటు సాయితేజ్ కూడా నటించాడు. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలను బాగానే పెంచేశారు. మరి నేడు థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
    కథ..
    మార్కండేయులు (సాయి ధరమ్‌ తేజ్‌) చిన్న వయసులోనే తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి అన్నీ తానే అయి కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుంటాడు. అతనికి ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉంటారు. అతనికి ఇంట్లో, పని చేసే చోట మంచి పేరు, మర్యాదలు ఉంటాయి. అయితే అతనికి అనుకోకుండా ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. దాంతో అతను చనిపోతాడు. ఆ సమయంలో అతనికి కాలం(పవన్‌ కళ్యాణ్‌) మద్దతుగా నిలుస్తాడు. మార్కండేయకు తిరిగి 90 రోజుల జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ సమయంలో పవన్ కల్యాణ్‌ అతని వెంటే ఉంటాడు. ఆ రోజుల్లో సాయితేజ్ ఏం చేశాడు, అతనికి 90 రోజులు తిరిగి ఎలా వస్తాయి అనేది మిగతా కథ.
    నటీనటుల పర్ఫార్మెన్స్..
    పవన్ కల్యాణ్‌ గతంలో గోపాల గోపాల సినిమాలో దేవుడిగా ఎంత బాగా మెప్పించాడో.. ఇందులో కూడా దేవుడిగా బాగానే నటించాడు. నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడేమో అనేంత కూల్ గా నటించి మెప్పించాడు. కొన్ని సాంగ్స్ లో వింటేజ్ పవన్ కల్యాణ్‌ ను చూపించాడు. ఇక సాయితేజ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి ఇరగదీసాడు అనే చెప్పుకోవాలి. మిగతా నటీనటులకు పెద్దగా ప్రాధాన్య లేదు. అయినా సరే వారి పాత్రల్లో ఒదిగిపోయారు.
    టెక్నికల్‌ పర్ఫార్మెన్స్..
    బ్రో సినిమా తమిళ వినోదయ సి్తతంకు రీమేక్. అయితే వినోదయ సిత్తంలో మెయిన్ హీరో కథ. అందుకే అక్కడ హిట్ అయింది. కానీ తెలుగుకు వచ్చేసరికి దర్శకుడు సముద్రఖని చాలా మార్పులు చేశారు. అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. కొన్ని చోట్ల పాటలను అనవసరంగా చొప్పించారని తెలుస్తోంది. ఇక సినిమాలో పవన్ ఇమేజ్ కోసం యాక్షన్ సీన్లు పెట్టడం కూడా విడ్డూరంగా ఉంది. పైగా పవన్ కల్యాణ్‌ కు పొలిటికల్ పంచ్ లు, పంచ్ డైలాగులు పెట్టడం ఇంకా విచిత్రంగా ఉంది. దాంతో ఒరిజినల్ కథలోని సోల్ మిస్ అయింది. మొత్తానికి పవన్ ఇమేజ్ కోసం ప్రయత్నించి కథను మార్చేసి దెబ్బ తిన్నారు. థమన్ అందించిన ఒకటి రెండు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సన్నివేశాల్లో కెమెరా వర్క్ చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కూడా గందరగోళంగానే ఉంది.
    ప్లస్‌ పాయింట్స్..
    పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ నటన
    ఫస్ట్‌ హాఫ్‌ సన్నివేశాలు
    మైనస్ పాయింట్స్..
    కథలో సోల్ మిస్ అయింది
    అవనసరంగా జొప్పించిన సీన్లు
    ఆకట్టుకోని మ్యూజిక్
    చివరగా…
    వినోదయ సిత్తంను రీమేక్ గా తీస్తే బాగుండేది. కానీ కథను మార్చేసి అనవసరం సీన్లు జొప్పించి ఒరిజినల్‌ కథలోని బలాన్ని చంపేశారు. కథలో సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి అనవసరంగా యాక్షన్ సీన్లు జొప్పించారు. లేనిపోని పంచ్ డైలాగులు పెట్టారు. ఇది కేవలం మెగా ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చుతుంది. సామాన్య ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు.
    రేటింగ్ : 2.5/5

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-Janasena : టీడీపీ-జనసేన పొత్తుకు జగన్ స్వాగతిస్తున్నారా?

    TDP-Janasena : తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    Bolisetti Satyanarayana : పొత్తుల వల్ల ఎవరికి ఉపయోగం.. జనసేనకు ఇంత తక్కువ సీట్లా?

    Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి...

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...