38.1 C
India
Sunday, May 19, 2024
More

    ‘Jailer’ Movie Review & Rating: ”జైలర్” రివ్యూ అండ్ రేటింగ్.. సూపర్ స్టార్ కు హిట్ దక్కినట్టేనా?

    Date:

    "Jailor" review and rating :
    “Jailor” review and rating :

    ‘Jailer’ Movie Review & Rating: సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని సినీ లవర్స్ లేరు అనే చెప్పాలి.. ఈయన కోలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. ముఖ్యంగా తెలుగులో ఈయనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.. అయితే గత కొన్నేళ్లుగా రజినీకాంత్ హిట్ లేక బాధ పడుతున్నారు.

    ప్రజెంట్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”జైలర్”.. ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో గత కొన్నేళ్లలో లేని అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా.. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఈ రోజు ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాతో సూపర్ స్టార్ హిట్ అందుకున్నాడా లేదా అనేది రివ్యూ అండ్ రేటింగ్ చూద్దాం..

    నటీనటులు :

    రజినీకాంత్
    తమన్నా
    మోహన్ లాల్
    సునీల్
    రమ్యకృష్ణన్
    శివరాజ్ కుమార్

    కథ :

    టైగర్ ముత్తువేల్ (రజినీకాంత్) ఒక జైలర్.. ఈయన రిటైర్ అయిన తర్వాత తన కుటుంబంతో ప్రశాంతంగా జీవితాంతం గడుపుతుంటారు.. ముత్తువేల్ కొడుకు అర్జున్ (వసంత్ రవి) కూడా ఒక పోలీస్ అధికారి.. ఈయన ఎంతో నిజాయితీ గల ఆఫీసర్.. ఈయన ఒక కేసు విషయంలో బయటకు వెళ్లి కనిపించకుండా పోతాడు.. అయితే ఆ తర్వాత అర్జున్ చనిపోయినట్టు తెలుస్తుంది..

    అయితే ముత్తువేల్ తన కొడుకు చనిపోలేదని తెలుసుకుంటాడు.. ఒక గ్యాంగ్ తన కొడుకుని తిరిగి పంపించాలంటే వారు చెప్పిన పని చేయాలనీ ఛాలెంజ్ విసిరాడు.. మరి ముత్తువేల్ ఏం చేసాడు? తన కొడుకుని ముత్తువేల్ ఎలా కాపాడుకున్నాడు? మరి ఆ గ్యాంగ్ నుండి తన కొడుకుని ఎలా తీసుకు వచ్చాడు? అనేది మిగిలిన కథ..

    నటీనటుల పర్ఫార్మెన్స్ :

    సూపర్ స్టార్ నటన గురించి చెప్పుకుంటే ఈయన పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది.. ఎప్పుడు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పే రజినీకాంత్ ఈ సినిమాలో చాలా ప్రశాంతంగా ఉంటూనే యాక్షన్ సీన్స్ కూడా చేసి అదరగొట్టాడు.. పెద్ద పెద్ద డైలాగ్స్ లేకపోయినా రజినీకాంత్ ఇలాంటి పాత్ర చేయడం కొత్తగా ఉంది.. ఈయన రోల్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.. రజినీకాంత్, రమ్యకృష్ణ మధ్య సీన్స్ అలరించాయి..

    ఇక సినిమాలో పాటలు సినిమాకు హైలెట్ అయ్యాయి.. పాటలు సినిమాలో చూడడానికి బాగున్నాయి.. ఇక డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్  ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా రజినీకాంత్ పాత్రను చాలా బాగా తీర్చిదిద్దారు.. కామెడీ, యాక్షన్ అన్ని కూడా ఆడియెన్స్ ను అలరిస్తాయి..  బీస్ట్ తో ప్లాప్ అందుకున్న నెల్సన్ ఈ సినిమాతో ఫ్యాన్స్ ను మెప్పించాడు..

    ప్లస్ పాయింట్స్ :

    రజినీకాంత్ రోల్
    భారీ తారాగణం
    పాటలు

    మైనస్ పాయింట్స్ :

    సెకండాఫ్ లో కొన్ని సీన్స్
    అక్కడక్కడ సాగదీసిన సన్నివేశాలు

    చివరిగా.. సినిమాలో మైనస్ పాయింట్స్ ఉన్న అవి పెద్దగా కనిపించక పోవడంతో ప్రేక్షకులను ఈ సినిమా బాగా అలరిస్తుంది.. రజినీకాంత్ ఈ వయసులో కూడా తన ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడ్డారు.. ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..

    రేటింగ్ : 3/5

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...