33.6 C
India
Monday, May 20, 2024
More

    Viral News : ఆల్రెడీ మేం చంద్రుడిపైనే ఉన్నాం.. పాకిస్తానీ పౌరుడి మాటలు వైరల్..

    Date:

    Chandrayaan
    Chandrayaan

    Viral News : మూన్ నార్త్ కు ఇప్పటి వరకు వచ్చారు.. వెళ్లారు.. కానీ సౌత్ కు వెళ్లడమే కిక్కు. దాన్ని ఇప్పుడు భారత్ విజయవంతం చేసింది. చంద్రుడిపై అదీ దక్షిణ ద్రువంపై పరిశోధనలు చేయాలనుకునే దేశాల జాబితాతో ఇండియా ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా చంద్రుడిపైకి వెళ్లాయి. కానీ ఉత్తర ధ్రువం వరకే వెళ్లి వచ్చాయి. దక్షిణ ధ్రువం వైపునకు వెళ్లేందుకు సాహసించలేదు. ఇండియా సాహసం చేసింది విజయాన్ని సొంతం చేసుకుంది.

    చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత చంద్రయాన్ 3 ని మరింత పకడ్బందీగా రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు. జూలై 14న ఎల్‌వీఎం-3 రాకెట్ సాయంతో చంద్రుడి దిశగా చంద్రయాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 41 రోజుల పాటు తన జర్నీని కొసాగించింది. 23వ తేదీ సాయంత్రం 5.44 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై నెమ్మదిగా ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా దిగింది. దీంతో దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి.

    ఇక చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా పూర్తిగా రద్దీగా మారింది. పాజిటివ్ మీమ్స్, ప్రముఖుల శుభాకాంక్షలు, విదేశాల నుంచి పొగడ్తలతో నిండిపోయింది. ఇందులో కొన్ని పోస్ట్ లు హ్యూమరస్ గానూ మరికొన్ని దేశభక్తిగానూ ఉన్నాయి. దాయాది దేశం పాక్తిస్తాన్ కూడా చంద్రయాన్ 3 సక్సెస్ తో తమ సొంత దేశంపై వెటకారంగా మాట్లాడారు. ‘చంద్రుడిపై మీ ఎగరేస్తే.. చంద్రుడే మా జెండా’పై ఉన్నాడు అన్నారు. వాస్తవానికి పాకిస్తాన్ జాతీయ జెండాలో చందమామ ఉంటుంది అది అర్థ వృత్తాకారం.

    అన్నింట్లో భారత్ తో ఢీ అంటే ఢీ అనే దాయాది దేశం పరిశోధనలు కూడా చేసింది. కానీ అవేవీ సక్సెస్ కాలేదు. ఇక దాని ఆర్థిక వ్యవస్థ కూడా నానాటికీ క్షిణించడంతో అంతరిక్ష ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. దేశాన్ని డెవలప్ చేయడం మాని ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. దేశ అవసరాలకు చైనాపై ఆధారపడి దేశాన్ని తాకట్టు పెట్టే దశకు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు చంద్రుడిపై విస్తృతంగా ప్రయోగాలు చేయడంలో ఇస్రో ప్రతీ సారి ముందే ఉంది. గతంలో చేసిన ప్రయోగాలతో చంద్రుడిపై నీటి జాడను ప్రపంచానికి తెలిపింది ఇండియానే.

    ఇప్పుడు చంద్రయాన్-3 ప్రయోగించి సేఫ్ ల్యాండింగ్ తో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ‘ప్రగ్యాన్’ రోవర్ కూడా బయటకు వచ్చింది. ‘జెండా మీద చంద్రుడు ఉండడం, చంద్రుడి మీద జెండా పాడడం బోత్ ఆర్ నాట్ సేమ్’ అనే మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘అఖండ’లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ను దీనికి జోడించి పాకిస్తాన్ అంతరిక్ష సంస్థను భారత నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Moon : చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఒక వింత వస్తువు.. అదేంటంటే?

    Moon : ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విడ్డూరాలు నిత్యం...

    Kiraak RP : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం – కిరాక్ ఆర్ఫీ

    Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి...

    Moon : చంద్రుడిపై ధ్వని ఎందుకు వినిపించదో తెలుసా?

    Moon : మనిషి తన తెలివితేటలతో ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు. చంద్రుడిపై కాలు...