38 C
India
Wednesday, May 15, 2024
More

    Mahesh-Rajamouli : మహేష్-రాజమౌళి కాంబో.. జ్యోతిష్యుడు చెప్పినట్లే జరుగుతోందా?

    Date:

    Mahesh-Rajamouli :

    సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తీయాలని దర్శకధీరుడు రాజమౌళి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.

    అయితే మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘గుంటూరుకారం’ తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రారంభం అయినప్పటికీ అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ సినిమా వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయితే తప్ప మహేష్ బాబు రాజమౌళి చేసే అవకాశం లేదు.

    రాజమౌళి సినిమాలో నటించే హీరోలను ఆయన ఒకటి రెండేళ్లపాటు లాక్ చేస్తుంటారు. గతంలో హీరో ప్రభాస్.. రాంచరణ్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు.. మూడేళ్లు పడుతుందని అందరికీ తెల్సిందే. ఇక ఆయన సినిమాల్లో నటించే హీరోలు ఆ సమయంలో మరే సినిమాలు చేయకుండా రాజమౌళి అగ్రిమెంట్ చేసుకుంటారనే టాక్ ఉంది.

    టాలీవుడ్లో ఇప్పటివరకు అపజయం లేకుండా దర్శకుడు రాజమౌళి దూసుకెళ్తున్నాడు. ఆయన సినిమాలకు జాతీయ అవార్డులే కాకుండా ఆస్కార్ అవార్డులు సైతం దక్కాయి. దీంతో రాజమౌళి తదుపరి మూవీలపై అందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి జాతకంలో శని దశ నడుస్తుందని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడు.

    ఈ సమయంలో రాజమౌళి సినిమాలు చేస్తే పెద్దగా కలిసి రాదని కూడా హింట్ ఇచ్చాడు. కొంతకాలం వెయిట్ చేస్తే సినిమా ఫలితం బాగుంటుందని రెమిడీ కూడా ఇచ్చాడు. ఈ జ్యోతిష్యాన్ని రాజమౌళి పెద్దగా నమ్మరు. అయినప్పటికీ రాజమౌళి.. మహేష్ కాంబో లేట్ అవుతూ వస్తోంది. ఈ సినిమా ఆలస్యం అవడం కూడా ఒకింత మంచిదేనని అభిమానులు చెబుతున్నారు. మహేష్ బాబు ‘గుంటూరుకారం’ ఇప్పట్లో పూర్తయ్యేలా కన్పించకపోవడంతో రాజమౌళి-మహేష్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    #SSMB29 : మహేశ్ సరసన చెల్సియా ఇస్లాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదు..

    #SSMB29 : బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు...

    Cinema Heroines : డబ్బుల కోసం వ్యభిచారం చేసిన హీరోయిన్స్ వీరే.. అడ్డంగా దొరికిపోయారు!

    Cinema Heroines : సినీ ప్రపంచం అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ పైకి...

    Remember ANR : ఒకే గదిలో ఏఎన్నార్ తో కలిసి ఉన్నా.. గుర్తు చేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి

    Remember ANR : అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రస్తుత జనరేషన్ కు...

    Rajamouli New Project : ఎట్టకేలకు నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన జక్కన్న.. టైటిల్ ఇదే?

    Rajamouli New Project : ప్రపంచం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ డైరెక్టర్...