
ప్రపంచం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.. తన విజన్ తో జక్కన్న చెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి. మరి అలాంటి డైరెక్టర్ సినీ ప్రయాణం ఎలా మొదలయ్యిందో ఎక్కడ నుండి మొదలయ్యిందో అందరికి తెలిసిన విషయమే..
ఈయన 23 ఏళ్ల కెరీర్ లో మొత్తం 13 సినిమాలు మాత్రమే తీశారు.. ఈ సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి విజయాన్ని అందుకున్నాయి.. రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క అపజయం కూడా అందుకోలేదు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్నో ఏళ్ల నుండి కలగా మిగిలి పోయిన ఆస్కార్ అవార్డును ఇండియాకు వచ్చేలా చేసాడు.. దీంతో ఈయన పేరు నలువైపులా వ్యాపించింది.
మరి అలాంటి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇంకా లాంచింగ్ చేసుకోని ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే తాజాగా ఎట్టకేలకు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఇది మహేష్ ప్రాజెక్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే..
మహేష్ ప్రాజెక్ట్ కాదు.. ఈయన ఇప్పుడు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనే కొత్త ప్రాజెక్ట్.. అయితే ఈ సినిమాకు జక్కన్న డైరెక్టర్ గా కాదు ప్రెజెంట్ చేస్తున్నాడు. బ్రహ్మాస్త్ర వంటి సినిమాను ప్రెజెంట్ చేసిన రాజమౌళి మళ్ళీ ఇన్ని రోజులకు ఈ సినిమాను ప్రెజెంట్ చేయబోతున్నారు. రాజమౌళి తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై మేడ్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేయబోతున్నారు.
ఈ సినిమాను నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తుండగా కార్తికేయ, వరుణ్ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమానే జక్కన్న ప్రెజెంట్ చేయబోతున్నారు. అసలు ఇండియన్ సినిమా ఎక్కడ పుట్టింది? ఆరిజిన్ ఏంటి? అనే కథతో ఇండియన్ సినిమా బయోపిక్ గా వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..