27.9 C
India
Thursday, September 10, 2026
More

    Mahesh-Rajamouli : మహేష్-రాజమౌళి కాంబో.. జ్యోతిష్యుడు చెప్పినట్లే జరుగుతోందా?

    Date:

    Mahesh-Rajamouli :

    సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తీయాలని దర్శకధీరుడు రాజమౌళి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.

    అయితే మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘గుంటూరుకారం’ తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రారంభం అయినప్పటికీ అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ సినిమా వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయితే తప్ప మహేష్ బాబు రాజమౌళి చేసే అవకాశం లేదు.

    రాజమౌళి సినిమాలో నటించే హీరోలను ఆయన ఒకటి రెండేళ్లపాటు లాక్ చేస్తుంటారు. గతంలో హీరో ప్రభాస్.. రాంచరణ్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు.. మూడేళ్లు పడుతుందని అందరికీ తెల్సిందే. ఇక ఆయన సినిమాల్లో నటించే హీరోలు ఆ సమయంలో మరే సినిమాలు చేయకుండా రాజమౌళి అగ్రిమెంట్ చేసుకుంటారనే టాక్ ఉంది.

    టాలీవుడ్లో ఇప్పటివరకు అపజయం లేకుండా దర్శకుడు రాజమౌళి దూసుకెళ్తున్నాడు. ఆయన సినిమాలకు జాతీయ అవార్డులే కాకుండా ఆస్కార్ అవార్డులు సైతం దక్కాయి. దీంతో రాజమౌళి తదుపరి మూవీలపై అందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి జాతకంలో శని దశ నడుస్తుందని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడు.

    ఈ సమయంలో రాజమౌళి సినిమాలు చేస్తే పెద్దగా కలిసి రాదని కూడా హింట్ ఇచ్చాడు. కొంతకాలం వెయిట్ చేస్తే సినిమా ఫలితం బాగుంటుందని రెమిడీ కూడా ఇచ్చాడు. ఈ జ్యోతిష్యాన్ని రాజమౌళి పెద్దగా నమ్మరు. అయినప్పటికీ రాజమౌళి.. మహేష్ కాంబో లేట్ అవుతూ వస్తోంది. ఈ సినిమా ఆలస్యం అవడం కూడా ఒకింత మంచిదేనని అభిమానులు చెబుతున్నారు. మహేష్ బాబు ‘గుంటూరుకారం’ ఇప్పట్లో పూర్తయ్యేలా కన్పించకపోవడంతో రాజమౌళి-మహేష్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajamouli : మహేష్ మూవీపై రాజమౌళి భారీ ప్రణాళిక

    Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాకు...

    Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ ఏడాది క్రితమే మొదలైందా?

    Rajamouli : నటుడు పృథ్వీ రాజ్ తాజాగా ఒక మీడియా సమావేశంలో ఆసక్తికరమైన...

    Rajamouli : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళికి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…

    Rajamouli : దర్శకుడు రాజమౌళికి మహేష్ బాబు నటించిన సినిమాల్లో 'ఒక్కడు' మరియు...

    Rajamouli : ఒడిశా ఆ ఒక్క విషయంలో నాకు చేదు అనుభవం మిగిలించింది – రాజమౌళి

    Rajamouli : ఒడిశాలో అత్యంత ఎత్తైన శిఖరం గా పిలవబడే దేవ్ మాలిని...