40.2 C
India
Sunday, May 19, 2024
More

    PM Narendra Modi : తొమ్మిదేళ్లలో ఒక్క సెలవు తీసుకోని ప్రధాని మోదీ..

    Date:

    PM Narendra Modi :

    ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా ఉన్న ఆదరణ మాములుగా ఉండదు. దేశవిదేశాల్లో ఆయన పేరు మార్మోగి పోతూ ఉంటుంది. అవిశ్రాంతంగా దేశ అభ్యున్నతికి శ్రమిస్తున్నారని బీజేపీతో మిత్ర పక్షాలు ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటాయి. ఆయన ఏది చేసినా దేశ ప్రయోజనాల కోసమేననే  అభిప్రాయాన్ని ఆ వర్గాలు తెరపైకి తెస్తుంటాయి.

    అయితే 2014లో మొదటి సారి ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక తరువాత వరుసగా రెండోసారి 2019లో కూడా ఆయనే ప్రధాని  అయ్యారు. ఈ  రెండు  పర్యాయాల్లో ఇప్పటివరకు ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని ప్రధాన మంత్రి కార్యాలయం తాజాగా తెలిపింది. అదేంటి ప్రధాని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదా.. అంటే .. అవును వారు ఇచ్చిన అధికారిక సమాధానం ఇదే.

    ప్రపుల్ పీ శార్ద  అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ ప్రశ్నను  అడిగారు. ప్రధాని ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుపాలని కోరాడు. ఈ  మేరకు ఈ ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఈ తొమ్మిదేళ్లలో ప్రధాని ఒక్క సెలవు కూడా  తీసుకోలేదని తెలిపింది. ఇప్పుడు ఈ ప్రతినే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే ఇప్పుడు పూర్తిగా వైరల్ అవుతున్నది. బీజేపీ శ్రేణులు పోటీపడి మరి ఈ కాపీని వైరల్ చేస్తున్నారు. గ్రేట్ మోదీ జీ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరెవరికీ సాధ్యం కాని విధంగా మోదీ పని చేస్తున్నారంటూ మరికొందరు ఆనందంతో ఊగిపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...