37.8 C
India
Saturday, May 18, 2024
More

    Nara Brahmani padayatra : లోకేశ్ అరెస్ట్ అయితే నారా బ్రాహ్మణి పాదయాత్ర…?

    Date:

    nara brahmini
    nara brahmini

    -ఇప్పటికే ప్లాన్-బి రెడీ చేసిన టీడీపి…
    -వైసీపీ పై ఎదురుదాడి షురూ చేసిన టిడిపి…

    Nara Brahmani padayatra : నేడు లండన్ నుండి విజయవాడ జగన్ రానున్నారు. 13 & 14 నా ఢిల్లీకి జగన్ వెళుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా తో కీలక సమావేశం ఉంది.. ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.. ఇది చూస్తుంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది కి గురిచేసి, వెనువెంటనే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు అరెస్ట్ తో జనసెన – టీడీపి బంధం బయటపడడం.. బీజేపీకి ఏపీలో వైసీపీ నే తోడు అంటూ సంకేతాలు ఇవ్వడం.. టీడీపిని ఇబ్బంది కి గురిచేయడం తో వైసీపీ నుండి టీడీపీలోకి దూకే ఎమ్మెల్యేలకు జగన్ & కో టీమ్ ముందుగానే వార్నింగ్ లు ఇవ్వడం జరిగిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేయడం చేస్తూనే ఉంది. ఇలా వైసీపీ ఒకదాని వెనుక మరొకటి ప్లాన్ రెడీ చేసుకొని ముందుకు వెళ్తోంది.

    చంద్రబాబు అరెస్ట్ తో ఒక్కసారిగా కంగుతిన్న టిడిపి నేతలు.. ఇప్పుడు ఇపుడే తేరుకొని ఎన్నికలకు ప్లాన్ రెఢీ చేస్తున్నారు.. టీడీపి కూడా ఈ సమయంలో ధీటుగా ఎదురుతిరిగి పోరాడితే తప్ప , జగన్ వ్యూహాలకు టిడిపి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.. అందుకే టీడీపీ కూడా ధీటుగా ప్లాన్ బి రెడీ చేస్తోంది.

    చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు లోకేష్ ను కూడా కేసుల్లో ఇరికించాలని జైలుకు పంపాలని చూస్తోంది. తద్వారా టీడీపీ తరుఫున ప్రచారం చేసే వారే లేకుండా చూసుకొని ఈ సమయంలో ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ కావడంతో వరుస కేసులతో బాబును జైల్లోనే ఉంచాలని వైసీపీ సర్కార్ కుట్ర పన్నుతోంది. సీఎం జగన్ ఈ మేరకు దారుణ కుట్రలు పన్నుతున్నట్టుగా పరిణామాలను బట్టి తెలుస్తోంది. వరుస కేసుల్లో చంద్రబాబును బుక్ చేయాలని చూస్తోంది. చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ ను కూడా జైలుకు పంపడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు సంచలన స్టెప్ వేసింది.

    తాజాగా ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈసారి ‘అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణను, ఏ6గా నారా లోకేష్ ను పెట్టి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు విడుదలైనా కూడా వదలకుండా వరుస కేసులతో చంద్రబాబును జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు నారా లోకేష్ ను కేసుల్లో ఇరికించాలని యోచిస్తోంది.

    ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తరుఫున బలంగా నిలబడేందుకు.. వైసీపీ రాజకీయ కుట్రలను ఎదిరించేందుకు నారా బ్రాహ్మణిని రాజకీయాల్లో రావాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. ఈ మేరకు బ్రాహ్మణి తెలివితేటలను ఉపయోగించుకోవాలని చూస్తోంది.

    ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ రాజకీయాల్లో ఉంటే కోడలు బ్రాహ్మణినే చంద్రబాబు వ్యాపార వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. హెరిటేజ్ సంస్థను నిర్వహిస్తున్నారు. నారా బ్రాహ్మణిని ఎంపీగా పంపించాలని చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు.చంద్రబాబు, లోకేష్ లపై కేసులు నమోదై జైలుకు వెళితే పార్టీ బాధ్యతలను బ్రాహ్మణికి అప్పగించాలని చూస్తున్నారు.

    చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా.. ఇక నారా లోకేష్ కూడా అరెస్ట్ అయితే నారా బ్రాహ్మణిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. బ్రాహ్మణితో పాదయాత్రకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్లాన్-బి రెడీ చేసిన టీడీపి బ్రాహ్మణితోనే ఎన్నికలకు వెళ్లాలని పాదయాత్ర చేసి టీడీపీపై సానుభూతిని పెంపొందించి గెలవాలని చూస్తోంది. ఈ మేరకు వైసీపీ పై ఎదురుదాడి షురూ చేసింది టిడిపి… బ్రాహ్మణి వ్యాపారాలే కాదు రాజకీయాల్లోనూ రాణించగలదని టీడీపీ నమ్మకంగా ఉంది. చంద్రబాబు, లోకేష్ ల వారసత్వాన్ని బ్రాహ్మణి కొనసాగించగలదని టీడీపీ నమ్మకంతో ఉంది. అందుకే ఆమెతో పాదయాత్ర చేయించి ప్రజల్లో సానుభూతిని కల్పించి గెలవాలని చూస్తోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Nara Brahmani : మహళల కోసమే సూపర్-6 పథకాలు: నారా బ్రాహ్మణి

    Nara Brahmani : మహిళలను ఆదుకునేందుకే సూపర్-6 పథకాలు అని నారా...