28 C
India
Friday, May 17, 2024
More

    Children Phone Addiction : చిన్నపిల్లలు మొబైల్ వాడితే నష్టాలేంటో తెలుసా?

    Date:

    harmful effects of mobile phones on children
    harmful effects of mobile phones on children

    Children Phone Addiction :

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటోంది. దీంతో వారు ఫోన్లకే ఆకర్షితులవుతున్నారు. పిల్లలు చిన్న నాటి నుంచే ఫోన్లు చూసే అలవాటు చేసుకుంటున్నారు. దీనికి తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉంది. వారు ఏడిస్తే చాలు ఫోన్ చేతిలో పెట్టడంతో వారికి ఫోన్ చూడటం అలవాటుగా మారుతోంది. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

    పిల్లలు మొబైల్ చూడటం వల్ల చాలా సమస్యలొస్తాయి. కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. నరాల బలహీనత కూడా రావచ్చు. ఆన్ లైన్ కు బానిసలుగా మారుతున్నారు. రాబోయే తరాలకు కూడా ఇది వ్యాధిలా మారుతోంది. రోజుకు ఓ అరగంట వాడితే ఫర్వాలేదు. కానీ అంతకన్నా ఎక్కువ సమయం వాడితే అనర్థాలు వస్తాయి. అందుకే ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

    ఫోన్ వల్ల వచ్చే ఇబ్బందులు పిల్లలకు వివరించాలి. ఫోన్ వాడకం తగ్గించాలి. వీటి వల్ల మనకు కలిగే నష్టాల గురించి తెలియజేయాలి. బయటకు వెళ్లి ఆడుకోవాలని సూచించాలి. శారీరక, మానసిక ఆటలు ఆడితే ఎన్నో లాభాలుంటాయని అర్థం చేయించాలి. పిల్లలకు క్రమశిక్షణ అలవాటు చేయాలి. దీంతో మొబైల్ మీద ఆసక్తి తగ్గేలా ప్లాన్ చేయడం వల్ల వారిని మొబైళ్లకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.

    మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. దీంతో వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ణానం కలిగి మొబైళ్ల వైపు కన్నెత్తి చూడకుండా ఉండొచ్చు. ఎలాగైనా వారిని మొబైల్ వాడకుండా చేయడమే మన అంతిమ లక్ష్యం. మొబైల్ వాడకం వల్ల అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. పలు రకాల ఇబ్బందులు రానున్నతరుణంలో మొబైల్ సేవలను తగ్గించాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Smartphones Effects On Children : చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్న స్మార్ట్ ఫోన్లు

    Smartphones Effects On Children : ఇటీవల కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు...

    Ganesh Utsavs : పిల్లలను వినాయకున్ని పెట్టనివ్వండి. ఎందుకంటే..

    Ganesh Utsavs : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఊరికే పుట్టలేదు. ఎందుకంటే అవి...

    చిన్నారులే వాడి టార్గెట్.. అర్థరాత్రి కిడ్నాప్ చేసి..

    తాగిన మైకంలో ఆ మానవమృగం ఏం చేస్తుందో తెలియదు. అభం,  శుభం...