38 C
India
Sunday, May 12, 2024
More

    Vallabneni Vamshi Clarity : చంద్రబాబు అరెస్ట్ పై యంగ్ టైగర్ స్పందించకపోవడానికి అదే కారణం.. అసలు విషయం చెప్పిన వల్లభనేని

    Date:

    Vallabneni Vamshi Clarity
    Vallabneni Vamshi Clarity

    Vallabneni Vamshi Clarity Viral Video : స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పటి నుంచి అటు రాజకీయాల్లో కాకుండా ఇటు ఇండస్ట్రీలో కూడా దుమారం రేగుతూ వస్తోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, సినిమాలకు విడదీయలేని బంధం ఉంది. నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీనే ఇందుకు కారణం. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొంత కాలం పని చేశారు. ఆ తర్వాత ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్నారు. ఇక చాలా సంవత్సరాలు సీఎంగా కొనసాగారు.

    హరికృష్ణ రెండో భార్యకు పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చెందిన వాడు. తాత వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి స్టార్ డం సంపాదించుకున్నాడు. బాల నటుడిగా కూడా ఆయన చేసిన సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. గొప్ప నటుడిగా ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చూసిన హాలీవుడ్ డైరెక్టర్లు సైతం యంగ్ టైగర్ తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారంటే ఆయన స్థాయి ఏంటో ఇట్టే అర్థం అవుతుంది.

    అయితే, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా జైలుు జీవితం గడుపుతున్నాడు. ఆయన అరెస్ట్ నుంచి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా నిరసనలు తలెత్తాయి. దాదాపుగా ప్రతీ సెలబ్రెటీ ఆయన అరెస్ట్ పై ఏదో ఒక రకంగా స్పందించారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అప్పట్లో టీడీపీ అభిమానులు, నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ దీనిపై సోషల్ మీడియా వేదికగా బాగానే ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా ఆయన స్పందించలేదు.

    యంగ్ టైగర్ ఎందుకు స్పందించలేదన్నది వల్లభనేని వంశీ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని అందరూ అంటున్నారు. కానీ ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను గౌరవించిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా..? చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా సరైన విధంగా గౌరవించలేదు. ఇప్పుడు స్పందించాలి.. స్పందించాలి అంటే ఎందుకు స్పందిస్తాడు. ఆయనా మనిషేకదా బాధలు ఉండవా..’ అని వల్లభనేని వంశీ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు ఎక్స్ (ట్విటర్)లో బాగా వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...