NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పేరుకు మించి ఎదిగిపో యాడు.. అంతకు మించి క్రేజ్ తెచ్చుకున్నాడు. వరుసగా సూపర్ హిట్ సినిమాలు కొడుతూ ముందుకు దూసుకువెళుతున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపో యిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. దీంతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో ఉన్న జూనియర్ తన కథలను ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.
గతంలో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు చేశాడు. అయితే టెంపర్ సినిమా ఆడియో విడుదల వేడుక లో మాట్లాడుతూ తాను గతంలో కొన్ని చెత్త సిని మాలు చేశానని, అనవసరంగా చేశానని, ఫ్లాపవు తాయని తెలిసినప్పటికీ చేయాల్సి వచ్చిందని, కానీ ఇకనుంచి అటువంటి సినిమాలు చేయనని, మంచి సినిమాలే చేస్తానంటూ అభిమానులకు హామీ ఇస్తున్నానన్నారు.
అప్పటి నుంచి తారక్ చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. కథల ఎంపికలో ఎవరి జోక్యం లేకుండా తనంతట తానుగా నిర్ణ యం తీసుకుంటున్నాడు. దీంతో ఎటువంటి కథ చేస్తే సూపర్ హిట్ అవుతుంది అనే అంచనాకు జూనియర్ రాగలిగాడు.