37.7 C
India
Saturday, May 18, 2024
More

    Team India Semis Berth Assured : టీమిండియా సెమీస్ బెర్త్ ఖాయం.. నేటి మ్యాచ్ గెలిస్తే గ్రాండ్ ఎంట్రీ

    Date:

    Team India Semis Berth Assured
    Team India Semis Berth Assured

    Team India Semis Berth Assured : వరల్డ్ కప్ 2023 లో ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచులో గెలిచింది టీమిండియా. మొదటి మ్యాచులో ఆస్ర్టేలియాను గెలవడంతో పాటు ఆఖరి మ్యాచులో న్యూజిలాండ్  వరకు అన్నింటినీ దాటుకొని వచ్చింది. ఇక ఆదివారం ఇంగ్లాండ్ ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నది.

    ఇక టోర్నీలో దారుణంగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఈ మ్యాచులో ఓటమెరుగని టీమిండియాను ఢీకొట్టబోతున్నది. సొంతగడ్డపై ఆడడం టీమిండియాకు బలం. ఆదివారం ఇంగ్లాండ్ తో పోరులోనూ గెలిస్తే, ఆ రికార్డును నిలబెట్టుకుంటే కూడా నాకౌట్ లో అడుగుపెడుతుంది.  టీమిండియా అనుకున్నదానికంటే మెరుగైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నది. అటు ఇంగ్లాండ్ మాత్రం ఐదు మ్యాచుల్లో కేవలం ఒక్కటే గెలిచింది. అది కూడా బంగ్లాదేశ్ పై గెలిచింది. ఇక అన్ని మ్యాచుల్లో ఓటములతో దాదాపు సెమీస్ కు దూరమైంది. అయితే మిగతా మ్యాచుల్లో గెలిచి, ఇతర జట్ల ఓటమి సమీకరణాలు కలిసివస్తేనే ఇంగ్లాండ్ కు అవకాశం ఉంటుంది.

    అయితే బలంగా ఉన్న టీమిండియాను ఢీకొట్టాలంటే మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇక లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుంది. భారీ స్కోర్లు చేయడం కష్టమే. మొదట్లో పేస్ బౌలింగ్ కొంత కష్టమే. రానురాను స్పిన్ అనుకూలిస్తుంది. అయితే ఇంగ్లాండ్ జట్టు నిజానికి బలమైనదే. బట్లర్ సేనను తక్కువ చేయడానికి ఏం లేదు. ఇక ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం ఇంగ్లాండ్ కథ వరల్డ్ కప్ లో ముగిసినట్లే. ఫామ్ పరంగా ఇప్పుడైతే టీమిండియాను ఎదుర్కోవడం మాత్రం ఇంగ్లాండ్ కు కష్టమే.

    టీమిండియాలో రోహిత్(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, కుల్ దీప్, అశ్విన్/సిరాజ్, బుమ్రా, షమీ
    ఇక ఇంగ్లాండ్ జట్టులో మలన్, బెయిర్ స్టో, రూట్, స్టోక్స్, బట్లర్(కెప్టెన్), లివింగ్ స్టన్, బ్రూక్/మొయిన్, అలీ, రషీద్, విల్లీ, వోక్స్, వుడ్/అట్కిన్సన్

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...