29.8 C
India
Thursday, May 16, 2024
More

    Spy Nikhil : అయ్యో పాపం ఈటీవీ.. ‘స్పై’తో అయిపాయె.. నిఖిల్ నేలమీదకొచ్చాడుగా!

    Date:

    Spy Nikhil
    Spy Nikhil

    Spy Nikhil : కార్తికేయ-2 పాన్ ఇండియా లెవల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో ఒక్కసారిగా నిఖిల్ పెద్ద స్టార్ అయిపోయాడు. వచ్చిన స్టార్ డమ్ మెయింటెన్ చేయాలంటే కొంచెం కష్టమే. అయితే ఆ ఊపులోనే మరో పాన్ ఇండియా మూవీ చేద్దామనుకుని ‘స్పై’ లాంటి మూసకథలోకే జారిపోయాడు. ఈ మూవీలో తలాతోకలేని కథ, అర్థం కాని స్క్రీన్ ప్లే.. ఇలా ప్లాప్ కావాల్సని అన్ని లక్షణాలు ఉండడంతో ఈడ్చికొట్టింది. నిఖిల్ మళ్లీ నేలపైకి వచ్చాడు.

    ఇలాంటి మూవీని ఈటీవీ ఈనెల మూడో తారీఖున ప్రసారం చేసింది. సినిమా అట్టర్ ప్లాప్.. డిజాస్టర్ అనే మౌత్ టాక్ ఉండనే ఉంది. అయినా కూడా టీవీలో ప్రసారం చేసింది ఏ ఒక్కరూ ‘దేఖ’లేదు సరికదా రేటింగ్ అత్యంత ఘోరంగా 1.28 వచ్చింది. దీనికి బదులు ఏ  అరవైల నాటి సినిమానో.. వేస్తే కనీసం రెండో, మూడో రేటింగ్ వచ్చేది.  నిఖిల్ కెరీర్ బాగుండాలంటే ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండాలని చెప్పే థియేటర్ అండ్ టీవీ గుణపాఠాలివి.

    నిజానికి కార్తికేయ మూవీతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ రేంజ్ తగ్గవద్దనుకుని ‘స్పై’ ను ఎంచుకున్నాడు. అయితే అన్ని సినిమాలు కార్తికేయ కావు కదా.. ఒక్కోసారి బోల్తా కొడుతుంటాయి. కథలో దమ్ము, స్క్రీన్ ప్లేలో పస లేకుంటే పాన్ ఇండియా లెవల్ లో తీసినా.. మన పక్క సందు టూరింగ్ టాకీసుల్లో కూడా పట్టుమని రెండ్రోజులు ఆడదు.

    హీరోగా ఎంత వర్క్ వుట్ చేసినా కథలో దమ్మే ముఖ్యం. లేదంటే ప్రతీ స్టోరీ పాన్ ఇండియా కాదా ఏంటి?. కార్తికేయ ట్రెండ్ వేరు.. స్పై మూస స్టోరీ వేరు.. అయితే  జనాలు ఎలా ఫీలవుతారో అదన్న తీయాలి.. లేకుంటే జనాలను ఫీల్ చేసేలాగానైనా తీయాలి. రెండింటిలో ఏదో ఒకటి జరిగినప్పుడే ‘కార్తికేయ’లు వస్తాయి. లేకుంటే ‘స్పై’లే పడుతాయి. నిఖిల్ పరిస్థితి ఇలా ఉంటే ఏదో చీప్ గా వచ్చింది కదా అని ఈటీవీ ఈమూవీని రిలే చేసి రేటింగ్ లో ఎక్కడో అడుక్కు పోయింది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chaitu Movie : కార్తికేయ 2 డైరెక్టర్ తో చైతూ మూవీ.. అతడి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతుందా?

    Chaitu Movie : తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగ చైతన్య యువ...

    2022 లో భారీ విజయం సాధించిన చిన్న చిత్రాలు

    భారీ చిత్రాలు ఎలాగూ భారీ విజయాలు సాధిస్తాయి లేదంటే భారీ నష్టాలను...

    NIKHIL – KARTHIKEYA 2:120 కోట్ల వసూళ్లను సాధించిన కార్తికేయ 2

    నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 విడుదలై 30 రోజులు అవుతున్నప్పటికీ...

    KARTHIKEYA 2:100 కోట్ల దిశగా కార్తికేయ 2

    నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం 100 కోట్ల దిశగా...