36.9 C
India
Monday, May 13, 2024
More

    Sriya Reddy : ఎవరీ శ్రియారెడ్డి.. ఏంటా ‘పొగరు’.. లేడీ విలన్ దొరికేసిందిగా!

    Date:

    Sriya Reddy
    Sriya Reddy

    Sriya Reddy : సలార్ మూవీ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ కు ఎంత పేరు తెచ్చిందో.. అనూహ్యంగా ఓ నటికి హీరోయిన్ కు మించిన పేరొచ్చింది. వెండితెరపై మరో ‘శివగామి’లా ఆకట్టుకున్న ఈ నడివయస్సు భామ ఎవరబ్బా..అని ఆమె అంటే తెలియని నేటి జనరేషన్ అనుకోవచ్చు. కానీ పాత సినీ జనాలకు ఈవిడ సుపరిచితమే.

    ఆమె పేరు శ్రియారెడ్డి.. ఆమెది 21ఏండ్ల సినీ ప్రయాణం.. కానీ చేసింది 14 సినిమాలే. 2005లో ఓసినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించింది. అప్పుడామెను అందరూ మరో విజయశాంతి అన్నారు..ఇప్పుడు సలార్ లో లేడీ విలన్ పాత్రలో మరో ‘శివగామి’గా ప్రశంసలు అందుకుంటోంది.

    శ్రియారెడ్డి వయస్సు 41 సం.రాలు. భరత్ రెడ్డి అనే ఓ ఇండియన్ క్రికెటర్.. చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది. ఆయన బిడ్డే శ్రియారెడ్డి. మొదట ఈమెకు మోడలింగ్ పై ఆసక్తి ఉండేది. తర్వాత సదరన్ స్పైస్ మ్యూజిక్ కు వీడియో జాకీగా మారింది. మెల్లిమెల్లిగా ఆడిషన్స్ ఇస్తూ 2002లో ‘సమురాయ్’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలేవీ రాలేదు. చాన్నాళ్లకు మలయాళంలో ఏకంగా మమ్ముట్టితో చేసింది. ఆ తర్వాత ‘అమ్మచెప్పింది’ అనే మూవీలో నటించింది. ఇలా ఏదో సినిమాలు చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టుగా ఉండగా విశాల్ సోదరుడు దర్శకుడు విక్రమ్ కృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అన్నాదమ్ముళ్ల కాంబోలో వచ్చిన ‘పొగరు’లో ఆమెకు అవకాశం ఇచ్చారు. విక్రమ్ కృష్ణతో ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి దాక వెళ్లింది కథ. అనంతరం ఆమె సినీ జీవితానికి బ్రేక్ పడింది.

    పదేళ్ల తర్వాత వడివేలు దర్శకుడిగా ఓ సినిమా తీస్తూ ఆమెను నటించడానికి ఒప్పించాడు. తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో సీరీస్ ఒకటి చేస్తూ ప్రశాంత్ నీల్ కండ్లలో పడింది. ఇంకెంటి..ఆమెకు సలార్ లో వరదరాజు సోదరి రాధారమ పాత్రకు ఎంపిక చేశాడు. ఆ పాత్రలో ఆమె ఒదిగిన తీరు అద్భుతం. జనాలు కూడా ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు. లేటెస్ట్ శివగామిగా కీర్తిస్తున్నారు.

    ఇక ఈమెకు అవకాశాలు వరుసకడుతున్నాయి. పవన్ ‘ఓజీ’లోనూ ఈమె చేస్తోందట. అలాగే చిరంజీవి ‘విశ్వంభర’లోనూ చాన్స్ కొట్టేసిందట. శ్రియారెడ్డి ఒంటికి, పొగరుకు సూటయ్యే రోల్ పడితే ఇక ఇరుగదీసుడే అన్నమాట. మొత్తానికి చిత్రసీమకు మరో లేడి విలన్ దొరికినట్టైంది.

    Share post:

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...