34.7 C
India
Friday, May 17, 2024
More

    Big Breaking: కరోనాతో స్టార్ హీరో మృతి

    Date:

    Star Hero Vijayakanth dies : నటుడు , డిఎండికె వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ కోవిడ్ -19 కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంటూ పరిస్థితి విషమించి చనిపోయారు.

    మంగళవారం కరోనా లక్షణాలతో పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు డీఎండీకే పార్టీ తెలిపింది. ఆ సమయంలో కరోనా పాజిటివ్ గా తేలడం.. అనంతరం చికిత్స అందించారు. విజయకాంత్ కు వెంటిలేటర్ పై చికిత్స చేశారు.

    ఈ రోజు అతను కోవిడ్ -19 పాజిటివ్ గా తేలాడని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడని.. చివరకు వెంటిలేటర్ మద్దతుపై ఉన్నాడని పార్టీ తెలిపింది. కొద్దిసేపటికే ఊపిరి ఆడక చనిపోయినట్లు ఆస్పత్రి తెలిపింది.

    నవంబరు 20న అడ్మిట్ అయిన తర్వాత డీఎండీకే అధినేత ఇటీవల ఆసుపత్రి నుండి తిరిగి వచ్చారు. విజయకాంత్ శ్వాసకోశ వ్యాధితో మరోసారి ఆసుపత్రిలో చేరి తుదిశ్వాస విడిచాడు.

    154 సినిమాల్లో నటించిన విజయకాంత్ సినీ పరిశ్రమలో విజయవంతమైన కెరీర్ ను కొనసాగించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.

    విజయకాంత్ డీఎండీకే ని స్థాపించాడు. విరుధాచలం , రిషివండియం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రెండుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశాడు. 2011 నుండి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన రాజకీయ జీవితం గరిష్ట స్థాయికి చేరుకుంది.

    ఇటీవలి సంవత్సరాలలో, విజయకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. అందుకే క్రియాశీల రాజకీయాలకు దూరంగా అస్వస్థతతో ఆస్పత్రి, ఇంటికే పరిమితమయ్యాడు.

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Corona : రాష్ట్రంలో కి అడుగుపెట్టిన కరోనా కొత్త వేరియంట్

      తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు...

    CORONA: ఏపిలో మెదలైన కరోనా అలజడి…అప్రమత్తం అయిన సీయం జగన్

          దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపిలో అధికారులు అప్రమత్తంగా ఉండాని...

    CORONA: మళ్లీ భయపెడుతున్న కరోనా…నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కేసు

        హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. నాంపల్లి...