28.9 C
India
Monday, May 13, 2024
More

    Jr. NTR : జపాన్ భూకంపం నుంచి తప్పించుకున్న ఎన్టీఆర్..షాక్ లో ఫ్యాన్స్

    Date:

    jr ntr net worth
    jr ntr net worth

    Jr. NTR Tweet : కొత్త సంవత్సరం మొదటి రోజే ఉత్పాతంలా వచ్చిన భూకంపం జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటివరకు 13మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం.. 46వేలకు పైగా ఇండ్లు భూకంపం బారిన పడ్డాయి. 62,000మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ ఏర్పడ్డాయి. 50వేలకు పైగా నివాసాలకు కరెంట్ సరఫరా స్తంభించిపోయింది. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీనివల్ల సహాయక చర్యల్లో జాప్యం ఏర్పడుతోంది.

    ఇదిలా ఉండగా జపాన్ భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. జపాన్ నుంచి ఈరోజే ఇంటికి వచ్చా.. తాను వచ్చిన వెంటనే అక్కడ  భూకంపం రావడంపై తాను షాక్ అయ్యానని, గత వారం రోజులుగా అక్కడే ఉన్నానని తెలిపారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు అంటూ తన అధికారికి అకౌంట్ లో పోస్టు చేశారు.

    ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.  దేవుడి దయ వల్లే ఎన్టీఆర్ త్వరగా బయటపడ్డారని, లేకుంటే ఏం జరిగేదో అని కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా జపాన్ ప్రజల గుండెలు గట్టివేనని, వారు ఎంత కిందకు పడిపోయినా ఉవ్వెత్తున్న మళ్లీ పుంజుకోవడం వారికి అలవాటేనంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. తమ హీరో ముందుగానే జపాన్ వదిలిపెట్టి రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    కాగా, జపాన్ భూకంపంపై ఆ దేశ ప్రధాని కిషిదా మాట్లాడుతూ.. కొత్త ఏడాది తొలి రోజే భూకంపం తమ దేశాన్ని తీవ్రంగా నష్టపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి, ప్రాణ నష్టం కూడా తీవ్రంగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...