37.8 C
India
Monday, May 13, 2024
More

    Norway : నార్వే నిర్ణయం సరైంది కాదు.. చైనా మాత్రం వంత పాడుతోందా?

    Date:

    norway deep sea mining project
    norway deep sea mining project

    Norway : మనిషి ఆకాశంలో ఎగరడం తెలుసుకున్నాడు. నీళ్లలో ఈదడం నేర్చుకున్నాడు. కానీ భూమి మీద మనిషిలా మారడం నేర్చుకోలేదు. దీంతో మన పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాడు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఇప్పటికే వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. చెన్నైకి వరదలు రావడం అందులో భాగమే. అకాల వర్షాలతో నగరాలు అతలాకుతలం అవుతున్నాయి.

    ఇప్పటికే అడవులు అంతరించిపోతున్నాయి. దీని ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మన పర్యావరణాన్ని పాడు చేసే పనులు చేపట్టడం మంచిది కాదు. ప్రపంచంలోని ఉత్తర ఐరోపా ఖండంలో ఉన్న చిన్న దేశం నార్వే. అది సముద్రంలోని రాళ్లను తొలగించి మైనింగ్ చేపట్టాలని ప్రయత్నించడానికి సిద్ధమవుతోంది.

    దీన్ని ప్రపంచంలోని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నా డ్రాగన్ మాత్రం సుముఖత వ్యక్తం చేస్తోంది. అందులోని లోపాలు తెలుసుకోకుండా గుడ్డిగా నార్వే నిర్ణయాన్ని సమర్థిస్తోంది. దీని వల్ల భవిష్యత్ లో వచ్చే నష్టాలను గుర్తించడం లేదు. సుమారు 30 వరకు దేశాలు నార్వే నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.

    సముద్రంలో రాళ్లను తొలగించే ప్రక్రియను తొలగించే బిల్లును పార్లమెంట్ ముందు ఉంచింది. ఒకవేళ అక్కడి పార్లమెంట్ మైనింగ్ కు అనుమతి ఇస్తే అది పనులు మొదలు పెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి చైనా తన మద్దతు తెలుపుతోంది. మైనింగ్ వల్ల మంచి లాభాలుంటాయని వాదిస్తోంది. దాని వల్ల కలిగే దుష్ర్రభావాలను లెక్కలోకి తీసుకోవడం లేదు.

    ప్రపంచ దేశాల నిర్ణయాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా కలిగే నష్టాల గురించి చొరవ చూపడం లేదు. తన నిర్ణయంతో పర్యావరణానికి నష్టం కలుగుతుందని తెలిసినా వారి పనికి సుముఖత వ్యక్తం చేస్తూ డ్రాగన్ మరో తప్పు చేస్తోంది. ఎప్పుడు కూడా అందరు ఒక వైపు ఉంటే డ్రాగన్ మరో వైపు ఉండటం కామనే. ఈనేపథ్యంలో డ్రాగన్ తీరును అందరు విమర్శిస్తున్నారు.

    నార్వే చేపడుతున్న మైనింగ్ ను అడ్డకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. నార్వే ఆ పని చేపడితే ప్రపంచానికి ముప్పు తలెత్తే ప్రమాదం ఉంటుంది. సముద్రం లోపల ఇంత వరకు మనం ఎలాంటి పరిశోధనలు చేపట్టలేదు. సముద్రం గురించి మనకు ఎక్కువగా తెలియదు. ప్రపంచంలో 70 శాతం నీరే ఉంటుంది. ఏ దేశ పరిధిలోని జలాలను ఆ దేశం వాడుకోవచ్చు. కానీ ఇలాంటి వాటికి కాదనే విషయం తెలుసుకుని నార్వే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం శ్రేయస్కరం అని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    China Population : చైనా జనాభా తగ్గడానికి కారణాలేంటో తెలుసా?

    China Population : ప్రపంచ జనాభా పెరుగుతోంది. చైనా జనాభా మాత్రం...

    Longest Traffic Jam : ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్.. ఏకంగా 12 రోజులు.. ఎక్కడో తెలుసా?

    Longest Traffic Jam : ట్రాఫిక్ జాంల గురించి మన ఇండియాలో...

    China: చైనాలో భూకంపం, 116 మంది మృతి

      చైనాలో భూకంపం సంభవించడంతో సుమారుగా 116 మందికి పైగా మృతి చెందారు....

    Biggest Birds : డైనోసార్ల కంటే పెద్ద పక్షులు ఉన్నాయా.. చైనాలో వెలుగు చూసిన వైనం

    Biggest Birds : మనుషుల పుట్టుక కంటే పూర్వమే డైనోసార్లు జీవించాయని చెబుతుంటారు....