37.4 C
India
Tuesday, May 14, 2024
More

    Padmavibhushan : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ‘జైచిరంజీవా!’.. పద్మవిభూషణ్ రావడంపై ఎన్ఆర్ఐల సెలబ్రేషన్స్

    Date:

    Padmavibhushan
    Padmavibhushan Chiranjeevi Celebrations at Times Squire New York

    Padmavibhushan Chiranjeevi : తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలుగు సినీ పరిశ్రమ మూడో నేత్రం మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమాకు పరుగులు నేర్పిన నటుడు ఆయన. తెరపై చిరు కనపడితే చాలు చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు ఆనందంతో కేరింతలు కొడుతారు. కమల్ హాసన్ నటన, రజినీకాంత్ స్టైల్.. ఈ రెండు కలగలిపిన ఏకైక నటుడు. డ్యాన్స్, ఫైట్లు, స్టైలిష్ యాక్టింగ్ ,కామెడీ టైమింగ్..ఇలా ఒక్కటేమిటి నటనలో నవరసాలు పలికించి కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఘనత ఆయనది.

    ఆయన కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఖైదీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. అందరి కళ్లను తనవైపు తిప్పుకున్నారు. అనాటి నుంచి ఈనాటి వరకు ఏనాడూ వెనుదిరిగింది లేదు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు సినిమాకు ఆయనే  నంబర్ వన్, మెగాస్టార్. తాను అగ్రహీరో కావడమే కాదు దాదాపు ఇప్పటి తెలుగు సినిమా హీరోలు, మిగతా టెక్నిషియన్స్ అందరికీ ఆయనే స్ఫూర్తి ప్రదాత. తన కుటుంబంలో కూడా పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు వచ్చారంటే అది చిరు చలువే.

    చిరంజీవి నటుడిగానే కాదు.. సామాజిక సేవలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. బ్లడ్ బ్యాంకు, ఐబ్యాంకులు గత రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సేవ అందిస్తున్నాయి. లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్నాయి. అలాగే కరోనా కాలంలో ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటిచెప్పారు. నటుడిగా, సామాజిక సేవకుడిగా కేంద్రం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్ తో పాటు తాజాగా పద్మవిభూషణ్ ప్రకటించింది.

    చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో తెలుగునేల పులకించిపోయింది. ప్రతీ తెలుగు బిడ్డ ప్రతీ ఒక్కరు తనకే పద్మవిభూషణ్ వచ్చిందా అనే సంతోషంతో మురిసిపోయారు. ఇక విదేశాల్లో ఎన్ఆర్ఐలు సైతం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై యూఎస్ లోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వైర్ వద్ద ఎన్ఆర్ఐలు అందరూ కేక్ కట్ చేసి జై చిరంజీవా.. నినాదాలతో హోరెత్తించారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికే గర్వకారణమని వక్తలు హర్షం వ్యక్తం చేశారు.

    All Images Courtesy by Dr. Shiva Kumar Anand

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొద్దని రోహిత్ చెప్పాడా..?

    Hardik Pandya : రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యాల మధ్య వివాదం...

    RCB : అలా జరిగితే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతే?

    RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 రెండో దశలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...