40.2 C
India
Sunday, May 19, 2024
More

    Poem : కవిత : అక్షరాల. అద్దాల…

    Date:

    Poem
    Poem

    కవిత : అక్షరాల. అద్దాల…

    అక్షరాల అద్దాల ఏ ఆత్మలు ప్రత్యక్షమయాయో…..
    నిక్షిప్తమై ఏ భావ శకలాలు రోదిస్తున్నాయో…
    యూగాల
    ప్రేమ ధార …. తప్తధారై రక్తధారై…
    నా మనసు కంట
    కురుస్తూనే ఉంది
    చెట్టు పండవక ….
    చేను. పంటవక …
    మింటి చుక్కలు నేల
    చూడక…
    నది లాస్యం ఎపుడాగి పోయిందో….
    సికరి కణ గణములు
    సిగ్గునెలా తలవాల్చాయో….
    మణి మాణిక్యాలను ముడిచిన మహి ఎండిన ఎడారి గొంతుకై…..
    పువ్వులేని…
    నవ్వులేని..
    అంతటా…..
    మోగని మువ్వలే
    నిర్దయ వర్జన్య ప్రాఖర్య దుర్మార్గ ఉద్రేకాలే
    ఏ ప్రాభవాన్ని పుడమి
    ఆశిస్తోందో…
    ఏ విషాదాన వియత్తలి
    శోకిస్తోందో…..
    ఏ జల ఘాతాల గర్జిత
    తరగల కడలి
    ఘూర్ణమౌతోందో…
    ఏ చక్రగ్రాహాలనో చిక్కి. చక్కబడని స్నేహాల చలించు జనత….నవ యువత
    ఏ పరిమితినాశిస్తోందొ…
    .హృదయాహ్లాద గీతం..
    సంగీతం…హితగీతం
    మతం…సమ్మతం…
    సమ్ముదం …మరచి…
    విడిచి…
    ఏ సముత్పత్తి కోసం
    ఏ వైపు ప్రయుక్తి లేని
    .ప్రయత్న రహిత పయనం…
    సమత నవత కనరాని
    ఏ దిక్కుల మొక్కుల
    మొగసాల వైపుకి……

    రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : కుమారుడు ఎగ్జామ్స్ బెయిల్ కోరిన కవిత..

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె...

    Kavitha : కవితకు బెయిల్ రాకపోతే తీహారు జైలుకేనా..? 

    Kavitha :  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ...

    Kavitha : కవిత ఆడపడుచు ఇంట్లో ఈడి సోదాలు..

    Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత బంధువుల ఇళ్లలో ఈడి అధికారులు...

    Hyderabad : సార్‌.. నన్ను గుర్తుపట్టారా..? నా ప్రాణాలు కాపాడింది మీరే

    Hyderabad : ఒకరి నుంచి సాయం పొంది వీలైనంత వేగంగా వారిని మరిచిపోతున్న...