39.4 C
India
Wednesday, May 22, 2024
More

    Mix up : మిక్స్ అప్ చూస్తే మతిపోవాల్సిందే..  ఇదేం కథరా బాబు

    Date:

    Mix up
    Mix up

    Mix up : ఓటీటీ ప్లాట్ పామ్స్ వచ్చిన తర్వాత ఎన్నోరకాల సినిమాలు, రొమాన్స్, ఉన్న కంటెంట్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇలా ఓటీటీ ప్లాట్ పామ్ లో వచ్చి మంచి మార్కులు కొట్టేసిన మూవీ మిక్స్ అప్. ఈ వెబ్ సిరీస్ భార్యాభర్తల మధ్య బంధాన్ని తెలుపుతుంది. అదే సమయంలో ఒక భార్య, భర్త నుంచి ఏం ఆశిస్తుంది. కేవలం కొన్ని విషయాలను తెలుసుకోవడం ఆశించడం వల్ల ఏం జరుగుతుందనేది ఇందులో బాగా చూపించారు.

    ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రెండు జంటలను ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలు గల భార్యలను, భర్తలను చూపిస్తారు. అభి, నిక్కి అనే హిరో హిరోయిన్లు వారి వైవాహిక జీవితంలో ఎలా ఉంటారు. అభికి నిజాయతీ ఎక్కువ. పద్ధతి గల మనిషి. నిక్కీ మాత్రం కాస్త తింగరిది. నిక్కీ అతడిని లెక్క చేయదు. కానీ అభికి మాత్రం నిక్కీ అంటే ఎంతో ఇష్టం.

    ఇక సాహూ (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ జవేరి) మరో జంటగా నటించారు. సాహు అనే వ్యక్తి తన లైఫ్ పార్ట్ నర్ నుంచి ఎక్కువగా సెక్సు చేయడం ఆశిస్తాడు. మైథిలి మాత్రం ప్రేమతో ఉండే శృంగారాన్ని కోరుకుంటుంది. కానీ దీనికి విరుద్ధంగా అతడు వ్యవహరిస్తాడు. అయితే మైథిలి మాత్రం దీన్ని అస్సలు తీసుకోలేకపోతుంది. దీంతో సాహు, మైథిలి మధ్య దూరం పెరిగి విబేధాలు వస్తాయి.

    నిక్కీ, సాహు గోవాలో కలుసుకుంటారు. ఇద్దరి మనస్తత్వాలు కలవడంతో శారీరకంగా కూడా సంబంధం పెట్టుకుంటారు. సాహుకు కావాల్సింది కూడా సెక్సే కాబట్టి దాన్ని కొనసాగిస్తాడు. అయితే ఈ విషయం అభికి, మైథిలికి  తెలుస్తుంది. దీంతో వీరిద్దరూ దగ్గరవుతారు. వీరు కూడా సంబంధం పెట్టుకుంటారు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరి వైఫ్ తో సంబంధం కొనసాగిస్తారు. ఇలా ప్రస్తుత జనరేషన్ కు తగ్గట్లు ఈ సినిమాను అందంగా రూపొందించారు.

    హిందూ సంప్రదాయంలో వివాహం బాధ్యతతో కూడుకున్నది. రెండు వేర్వేరు కుటుంబాలు కలిసి ముందుకు సాగుతాయి.  అప్పటి వరకు పరిచయం లేని వారితో పెళ్లి తర్వాత కలిసి నడవాల్సి ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి పరిష్కరించుకొని ముందుకుసాగుతున్నారు. కానీ పాశ్చాత్య ధోరణి కారణంగా  తమ భావాలకు అనుకూలంగా ఉన్నవారితోనే కలిసి ఉండాలనుకుంటున్నారు.  మరి ఆ అర్థం చేసుకోవడం ఏమిటీ అనే అనే ప్రశ్నతో సినిమా స్టార్ట్ అవుతుంది. రెండు జంటలు తమ భాగస్వామితో  విడిపోవాలనుకుంటున్నట్లు చెప్పడంతో మూవీ కథలోకి వెళ్తుంది.

    సరైన భాగస్వామి కోసం

    రెండు జంటలకు ఒకే రకమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కానీ, వారు ఊహాలకు అనుగుణంగా వారి భాగస్వామి ఉండరు. అదే వారికి సమస్య. ఒకరికి శృంగారం అంటే విపరీతమైన పిచ్చి, మరొకరికి పెళ్లి, లవ్ అంటే సెక్స్ మాత్రమే కాదని ఫీలింగ్. కేరింగ్, రెస్పెక్ట్ వంటి చాలా ఉంటాయని భావిస్తుంటారు. తమకు దక్కాల్సిన సరైన భాగస్వామి మరొకరికి దొరికారని అర్థమైపోతుంది. వారు వారు తమ  సరిజోడి భాగస్వాములతో పెళ్లయిన తర్వాత గోవా ట్రిప్‌లో ఎలా కలుసుకున్నారన్నదే సినిమా కథ.

    ముందే ఊహించేదే..

    మిక్స్ అప్ ఊహించని మలుపులు, ట్విస్టులంటూ ఏముండవు. ప్రారంభంలోననే సినిమా క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకుడు ఊహించేస్తాడు. అయితే ప్రేక్షకుడిని కట్టిపడేసే సీన్స్ అంతగా పేలలేదు. ఓవైపు బెడ్ రూమ్ సీన్స్ కొన్ని, మరోవైపు బ్యూటీఫుల్ లవ్ ట్రాక్ సన్నివేశాలతో సినిమా నిండి ఉంటుంది. లవ్ ట్రాక్‌కు సంబంధించిన సీన్స్ బాగున్నాయి. కొంచెం ఫీల్ తెప్పించేలా ఉంటాయి.

    డైరెక్టర్ వెర్షన్..

    దర్శకుడు తాను ఏం చెప్పాలనుకున్నాడో, ఎలా తీయాలనుకున్నాడో అది తెరమీద స్పష్టంగా కనిపించింది. కానీ, ఓవరాల్‌గా చూస్తే మాత్రం మ్యాచ్  చేయడంలో కొంత తడబడినట్లు కనిపిస్తుంది.  ఇక  ‘పెళ్లి అంటే అవతలి వాళ్లను అర్థం చేసుకోవడంతో పాటు అవతలి వాళ్ల చేత అర్థం చేసుకునేలా వ్యవహరించడం కూడా’  అనే సందేశాన్ని ఇచ్చాడు. ఈ సినిమాను భార్యాభర్తలు మాత్రమే కలిసి చూడొచ్చు. కుటుంబసభ్యులతో కలిసి చూడాలనే సాహసం చేయకపోవడమే ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    Pennelli Ramakrishna : మాచర్ల ఎమ్మెల్యే అరెస్టులో హైడ్రామా.. కారు వదిలి పారిపోయిన పిన్నెల్లి

    Pennelli Ramakrishna : ఏపీలో మే13న పోలింగ్ ముగిసింది.   ఎన్నికల...

    Shriya Saran : రెట్టింపు అందంతో హొయలు పోతున్న శ్రియా శరణ్..

    Shriya Saran : ఫాబ్లూక్ మ్యాగజైన్ కోసం తన లేటెస్ట్ లుక్...

    CBI Investigation : సీబీఐ విచారణపై మళ్లీ సీబీఐ విచారణ!

    CBI Investigation : కేసుల్లో నిగూఢంగా దాగున్న వాస్తవాలను బయటకు తీసేందుకు...

    Getup Srinu : గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ ను రిపీట్ చేయగలడా?

    Getup Srinu : కమేడియన్లు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ గా మారి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MIX UP : ఓటీటీలోకి బోల్డ్ కంటెంట్ మూవీ.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..!

    MIX UP : ప్రేక్షుకల అభిరుచికి తగ్గట్టుగా ఓటీటీలోకి ఎన్నో సిరీస్లు,...