Nara Bhuvaneshwari : ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. ‘ ప్రజలకు సేవ చేయాలనే తపనకు వంద శాతం అండగా నిలిచిన నా సర్వస్వానికి జన్మదిన శుభాకాంక్షలు’ అని విష్ చేశారు. ” ఎప్పుడూ నాకు బలంగా మద్దతు తెలిపే, కష్టకాలంలో కూడా నవ్వుతూ… ప్రజాసేవ చేయాలనే నా ఆకాంక్షకు వంద శాతం అండగా ఉండే భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు. నీవే నా సర్వస్వం” అంటూ రాసుకొచ్చారు.
కుమారుడ నారా లోకేష్ కూడా తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ” నీ ప్రేమ, కరుణ, సపోర్టే నాకు అత్యంత బలాన్ని ఇస్తుంది.. ప్రజా సేవపై, వ్యాపార అభివృద్ధిపై, న్యాయ పోరాటం పై నీకు ఉన్న భక్తి నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. ప్రతి రోజూ నేను నిన్ను మరింతగా ఆరాధిస్తాను.. రోజూ మీ ప్రేమాభిమానాలతో మా జీవితాలను మరింత ప్రకాశవంతం చేస్తావు.. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.”అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కోడలు బ్రహ్మణి కూడా భువనేశ్వరి బర్త్ డే విషెస్ శుభాకాంక్షలు తెలిపారు. “నా దిక్సూచి అయిన అత్తగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నా కలలను సాకారం చేసుకోవడానికి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించి నా ఎదుగుదలకు సహకరించారు. మా కుటుంబానికి మీరే కేంద్రం. మా బలం…. అంటూ లోకేష్ భార్య బ్రహ్మణి కూడా ట్వీట్ చేశారు.
పురందేశ్వరి కూడా తన సోదరి భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫొటోను ఆమె షేర్ చేశారు.
మీ భక్తికి గర్వపడుతున్నా అంటూ రిప్లై
చంద్రబాబు ట్వీట్ కు భువనేశ్వరి రిప్లై ఇచ్చారు. ‘ధన్యవాదాలు అండి.. నేను ప్రతిరోజు మెరుగ్గా ఉండడానికి మీరే నాకు ప్రేరణ’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన పెద్ద కుటుంబం పై మీ భక్తికి నేను గర్వపడుతున్నాను. మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అని ట్వీట్ చేశారు. అంతేకాదు మీరేనా సర్వస్వం అంటూ చంద్రబాబు ట్వీట్ కు ప్రేమగా రిప్లై ఇచ్చారు భువనేశ్వరి.