RGV : ఆర్జీవీ (రాంగోపాల్ వర్మ) గురించి దేశ వ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. సినిమా దిశను, గతిని మార్చిన దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సంచలన సినిమాలు తీసి సంచలన దర్శకుడిగా కూడా ట్యాగ్ సంపాదించుకుంటున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న వర్మ విచిత్రమైన వ్యక్తిత్వం కలవారని తెలిసిందే. ఆయన ఆలోచనలు ఎప్పుడు ఎటు వెళ్తాయని ఎవరూ గెస్ చేయలేరు. ఒకసారి రక్త చరిత్ర అన్న ఆయన తర్వాత ‘శారీ’ అంటూ నిర్మాతగా ఉన్నానంటూ చెప్తారు.
ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వర్మ పొలిటికల్ బురదను అంటించుకున్నారు. ఒక పార్టీని భుజాలకు ఎత్తుకొని వారికి అనుకూలంగా సినిమాలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి చేశాడు. పచ్చిగా చెప్పాలంటే వైసీపీకి పెయిడ్ ఏజెంట్ గా మారాడు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన మార్ఫింగ్ చిత్రాలను పోస్ట్ చేసేవారు.
వైఎస్ జగన్ అధికారం కోల్పోరని ఆర్జీవీ భావించారు. తమకు నచ్చిన పార్టీకి మద్దతివ్వడంలో తప్పు కనిపించడం లేదు కానీ ఆర్జీవీ చేసింది మాత్రం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎన్నికల వరకు ఆయన పొలిటికల్ ట్వీట్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.
అయితే ఎన్నికల్లో జగన్ ఓడిపోయినప్పటి నుంచి ఇకపై తాను రాజకీయ సినిమాలు చేయనని ఆర్జీవీ బహిరంగంగా ప్రకటించారు. ట్విటర్ లో కూడా ఆయన ఎలాంటి రాజకీయ ట్వీట్లకు దూరంగా ఉంటున్నారు. అయితే తమ అభిమాన నేతలను అవమానించిన ఆర్జీవీపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ మళ్లీ అమ్మాయిల హాట్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చే కొన్నేళ్ల పాటు సేఫ్ అని భావిస్తున్నాడు.