26.1 C
India
Sunday, June 30, 2024
More

    Manchu Lakshmi : నన్ను అన్యాయం చేశారు.. తండ్రి మోహన్ బాబుపై మంచు లక్ష్మి కామెంట్స్

    Date:

    Manchu Lakshmi
    Manchu Lakshmi

    Manchu Lakshmi : సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు కూతురు, సినీ నటి మంచు లక్ష్మి ఫ్యామిలీ విషయాలు బయటపెట్టింది. కుటుంబంలో తనకు అన్యాయం జరిగిందంటూ అందుకు కారణం తండ్రిని చూపుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

    నిర్మాతగా, ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది. నెటిజన్లతో ఎప్పుడూ టచ్ లో ఉంటున్న ఆమెకు టాలీవుడ్ లో ఆశించినంత గుర్తింపు రాలేదు. దానికి కారణం తన తండ్రి అని చూపుతూ తండ్రి మీదే ఆమె ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

    కుటుంబంలో తను ఒక బాధితురాలిని అని సంచలన విషయాలు బయటపెట్టేసింది లక్ష్మి. నేను నటన వైపు వెళ్లడం మా నాన్నకు ఇష్టం లేదు. నా సోదరులకు సులభంగా దక్కినవి నేను మాత్రం కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. పితృ స్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే.. అని చెప్పుకచ్చింది మంచు లక్ష్మి.

    రానా, రకుల్ ప్రీత్ లాంటి స్నేహితులు ముంబై వెళ్లి ఏదైనా కొత్తగా ట్రై చెయ్ అనేవారు. కానీ ముంబై పంపించాలంటే మా పేరెంట్స్ ఒప్పుకునేవారు కాదు. దక్షిణాదిలో స్టార్స్ తమ కూతుళ్లు, చెల్లెళ్లు, అక్కలు సినిమాల్లో నటిస్తే ఇష్టపడరు. అలాంటి పరిస్థితే నాకు వచ్చింది అని మంచు లక్ష్మి చెప్పుకచ్చారు.

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నేను ఆ తర్వాత హీరోయిన్‌గా.. ఆ తర్వాత నిర్మాతగా ప్రయోగాలు చేశాను. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే టీవీ షోస్ కూడా చేస్తున్నాను.

    ఇక కొన్ని రోజులుగా అందాల ఆరబోతలో తాను కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది మంచు లక్ష్మి. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే వెండితెరపై రెచ్చిపోవాలని మంచు లక్ష్మి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

    చాలా రోజులు అమెరికాలోనే ఉన్న మంచు లక్ష్మి.. 2011లో తెలుగు ఇండస్ట్రీలో ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ వస్తోంది.

    Share post:

    More like this
    Related

    World Cup Celebrations : ప్రపంచ కప్ సంబురాలు.. ట్యాంక్ బండ్ పై అభిమానుల కేరింతలు

    World Cup Celebrations : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో...

    Virat Kohli : టీ20లకు విరాట్ బైబై

    Virat Kohli : టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20...

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    Manchu Lakshmi : రెండేళ్ల తర్వాత మంచు లక్ష్మి రీ ఎంట్రీ.. ఏ పాత్రనో తెలుసా?

    Manchu Lakshmi : మంచు లక్ష్మి రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘ఆదిపర్వం’...

    Manchu Lakshmi : ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న మంచు లక్ష్మి.. మీనింగ్ తెలిస్తే మతిపోవాల్సిందే..

    Manchu Lakshmi : టాలీవుడ్ నటి, నిర్మాతగా పలు సినిమాలు చేసిన...