Manchu Lakshmi : టాలీవుడ్ నటి, నిర్మాతగా పలు సినిమాలు చేసిన మంచు వారి అమ్మాయి లక్ష్మి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఒంటిపై వేసుకున్న టాటూ చర్చనీయాంశమైంది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. హాట్ హాట్ ఫొటోలు, బోల్డ్ స్టిల్స్ తో ఫొటో షూట్ లు చేసి కుర్రాళ్ల చూపులను తన వైపునకు తిప్పుకునేలా ట్రైచేస్తుంటుంది.
మంచు లక్ష్మి తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో ఆమె సంప్రదాయ పద్ధతిలో హుందాగా చీర కట్టుకుని హుందాగా పోజులిచ్చింది. అయితే ఈ ఫొటోలకు ముందు షేర్ చేసిన పిక్స్ లో మాత్రం వీపుపై ఇంగ్లిష్ లెటర్స్ ను టాటూగా వేయించుకుంది. ‘‘వాట్ యూ సీ సీకింగ్ యూ’’ అని రాయించుకోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏదో సందేశం ఇవ్వాలని ట్రై చేసిన మంచు లక్ష్మి తన జబ్బపై ఇలా ఈ అక్షరాలు పచ్చబొట్టుగా వేయించుకోవడం ఏమిటని సెటైర్స్ వేస్తున్నారు. ఒళ్లు చూపించడానికే ఈ స్టిల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మంచు లక్ష్మి ఐదు పదుల వయసు పైబడుతున్నా ఇంకా స్వీట్ 16 అన్నట్టుగా బిల్డప్ లు ఇస్తూ ఫొటో షూట్ లు చేయడం, ర్యాంప్ వాక్ లు, ఫ్యాషన్ ఫొటోషూట్ లు చేయడమేంటని నెటిజన్లు పంచ్ లు విసురుతున్నారు. అయినా మంచు లక్ష్మి ఇవన్నీ కామనేనని కొందరు అంటున్నారు. మొదట్లో ఫారిన్ ఇంగ్లిష్ మాట్లాడుతూ వేదికలు, ఫంక్షన్లలో విపరీతంగా ట్రోల్స్ బారిన పడేది. ఆ తర్వాత మై హౌస్ అంటూ యూట్యూబ్ లో తన పర్సనల్ వీడియోలు షేర్ చేసేది. మంచు లక్ష్మి నటిగానూ, నిర్మాతగానూ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. చివరకు సోషల్ మీడియాలో కూడా తన విపరీత ప్రవర్తనతో నెటిజన్లతో చివాట్లు తినడం ఆమెకే చెల్లింది.