27.1 C
India
Sunday, June 30, 2024
More

    Pawan Kalyan and Jagan : బద్ధ శత్రువులు కలిసిన వేళ..జగన్-పవన్ కలయిక వైరల్

    Date:

    Pawan Kalyan and Jagan
    Pawan Kalyan and Jagan

    Pawan Kalyan and Jagan : జనసైనికులకు, మెగాభిమానులకు జూన్ 21 కలకాలం గుర్తుండిపోతోంది. 21 సీట్లలో పోటీ చేసి..21 సీట్లు గెలిచి..21వ తేదీన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడం జనసేనకే దక్కింది. జగన్ అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తానని చెప్పి మరీ ఆ పనిని చేసి చూపించారు పవన్. కూటమి ఏర్పాటుతోనే తొలి విజయం సాధించిన పవన్..ఆ తర్వాత మూడు పార్టీలను కలిసికట్టుగా నడిపించడానికి చంద్రబాబుతో కలిసి సక్సెస్ అయ్యారు. మూడు పార్టీల ఓటు బదిలీ సక్రమంగా జరిగి..కూటమి మ్యానిఫెస్టోకు డబుల్ ఓకే చెప్పిన ఏపీ ప్రజలు జగన్ పాలనకు చరమగీతం పాడారు. కూటమికి 164 సీట్లను అందించి ఘన విజయం అప్పగించారు. ఇక జగన్ కు దిమ్మతిరిగేలా కేవలం 11 సీట్లలో గెలిపించి..కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు.

    ఏపీ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు మొత్తం భారత రాజకీయ, సినీ, క్రీడా రంగాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎన్నికల ముందు వైసీపీ ముఠా నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు పవన్. అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటూ ‘ఫ్యాన్ మూక’ శపథాలు చేసింది. అయితే పవన్ గాజు గ్లాస్ దెబ్బకు ఫ్యాన్ రెక్కలు 11 ముక్కలు అయ్యాయి. పవన్ ను మాటలతో ఎంతగా హింస పెట్టారో..అంతకు వందరెట్లు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు జగన్ అండ్ కో.

    ఫ్యాన్ రెక్కలు విరిచి మరీ డిప్యూటీ సీఎం అయ్యారు పవన్. ఇవాళ ఎమ్మెల్యేగా ఘనంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అసెంబ్లీలో అభినందనలు తెలిపారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బద్ధశత్రువులు కలిశారని కొందరు కామెంట్ చేస్తే..మరికొందరు పవన్ ‘పవర్’ అదంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా, ఆ తర్వాత కొద్దిసేపటికే జగన్ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు.

    Share post:

    More like this
    Related

    Suryakumar Yadav : కప్పు తెచ్చిన క్యాచ్.. కపిల్ ను గుర్తు చేసిన సూర్య

    Suryakumar Yadav : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్...

    Varshikotsava Celebrations : శ్రీ సాయి దత్త పీఠంలో ‘వర్షికోట సేవా’ ఉత్సవాలు

    Varshikotsava Celebrations : భారతీయ సంస్కతి, ఆధ్యాత్మికను పెంపొందించేందుకు అమెరికాలో ఏర్పాటు...

    TTD Chairman : టీటీడీ చైర్మన్ పదవి వారికేనా..?

    TTD Chairman : ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత ప్రదేశం తిరుమల. కలియుగ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...