24.4 C
India
Monday, July 1, 2024
More

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    Date:

    International Space Station
    International Space Station

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో తలదాచుకోవలసి వచ్చింది. ఐఎస్ఎస్ కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

    ఐఎస్ఎస్ కు దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు నాసా బుధవారం గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు చేరవేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ ల్లోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 5 నుంచి అక్కడ ఉన్న విలియమ్స్, విల్మోర్ లు స్టార్ లైనర్ క్యాప్సుల్ లో తలదాచుకున్నారు.  సుమారు గంట సేపు మిషన్ కంట్రోల్స్ ఇక్కడి వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశితంగా పరిశీలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పులేదని నిర్ధారించుకొని వ్యోమగాములకు క్లియరెన్స్ ఇచ్చారు.

    రష్యాకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం రిస్యూర్స్-1 రెండేళ్ల క్రితం నిరుపయోగంగా మారింది. ఇది బుధవారం దాదాపు 100 ముక్కలలుగా విడిపోయింది. ఈ పరిణామాలు మొత్తం ఐఎస్ఎస్ కు అత్యంత సమీపంలోనే జరిగాయి. కొన్ని గంటల పాటు దీని నుంచి శకలాలు వెలువడ్డాయని లియోల్యాబ్స్ అనే స్పేస్ ట్రాకింగ్ సంస్థ పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఆ బుడతడు అంత మంది ప్రాణాలు కాపాడాడా?

    సాహసం చేయరా ఢింబకా అంటారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తి పాటిస్తే మనకు...