Balakrishna, Chiranjeevi ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో మల్టీ స్టారర్ సినిమాలు కామన్ అయ్యాయి. బిగ్ హీరో, మంచి కథ అయితే అన్ని చిత్ర పరిశ్రమలు కలిసి పని చేస్తున్నాయి. కేజీఎఫ్ లో అప్ కమింగ్ హీరో యష్ చేయగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించాడు. ఇక చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ నటించారు. ఇక ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఇలా మల్టీ స్టారర్ సినిమాలు ఇప్పుడు కామనే.
కానీ 1980లో మాత్రం లేవు అనేకంటే తక్కువని మాత్రం చెప్పవచ్చు. ఎన్టీఆర్ సినిమాలో మోహన్ బాబు నటించారు. ఎన్టీఆర్ అప్పటికే బగ్ స్టార్ కానీ మోహన్ బాబు మాత్రం అప్ కమింగ్ స్టార్ కాబట్టి ఎన్టీఆర్ మాత్రమే హీరోగా కనిపించేవాడు. ఆ జామానాలో టాలీవుడ్ సూపర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణతో కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నాడు రాఘవేందర్ రావు. ఆలోచన వచ్చిందే తడవుగా ఇద్దరినీ సంప్రదించాడు. కథ గురించి కూడా చెప్పాడు. దీంతో వారు కూడా ఒకే అన్నారు. చిత్రం సెట్స్ పైకి వెళ్లింది.
షూటింగ్ సగం వరకు పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి చిరంజీవి తప్పుకున్నాడు. ఆ సినిమానే ‘అపూర్వ సహోదరులు’. చిరంజీవి ఇందులో నుంచి ఎందుకు తప్పుకున్నాడో కారణం మాత్రం చెప్పలేదు. ఇక చేసేది లేక రాఘవేందర్ రావు బాలకృష్ణకు డ్యూయల్ రోల్ అప్పగించి ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఒక వేళ చిరంజీవి ఈ సినిమాలో చేసి ఉంటే మల్టీ స్టారర్ చిత్రం అయ్యేది. ఇటు నందమూరి, అటు మెగాస్టార్ అభిమానులు ఆ రోజుల్లోనే బిగ్ పెయిర్ చూసేవారు.