32.2 C
India
Monday, April 29, 2024
More

    megastar : ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఇప్పుడు స్టార్ హీరో

    Date:

    megastar :
    megastar :

    megastar : ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తు పట్టారా? టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి దేశంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఇతడి గురించి పరిచయం అక్కర్లేదు. ఒంటి చేత్తో ఇండస్ట్రీని ఏలుతున్నాడు. కోట్లాది మందికి అభిమాన హీరో అయ్యాడు. దేశం గర్వించదగ్గ కథానాయకుడిగా నిలిచాడు. నటన వైపు వచ్చే వారికి రోల్ మోడల్ గా ఉన్నాడు. దీంతో చాలా మంది పరిశ్రమకు వచ్చే వారికి ఆయనే ఆరాధ్య దేవుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయనే మెగాస్టార్ చిరంజీవి.

    మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవడానికి వెళ్లాడు. అప్పుడే పునాదిరాళ్లు సినిమాలో నటించాడు. కానీ ముందు విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తరువాత మనఊరి పాండవులులో నటించాడు. ఇది కథ కాదు, రాణికాసుల రంగమ్మ వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించాడు.

    1980లో వచ్చిన మొగుడు కావాలి సినిమా విజయం సాధించింది. దీన్ని తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. తరువాత చట్టానికి కళ్లు లేవు సినిమాలో హీరోగా కనిపించాడు. ఈ సినిమా విజయ్ దళపతి తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చింది. ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య సినిమా కూడా బాగా ఆడింది. కానీ ఖైదీ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు.

    యండమూరి వీరేంద్రనాథ్ నవలల ఆధారంగా 11 సినిమాలు చేశారు. అందులో రాక్షసుడు, అభిలాష, దొంగమొగుడు వంటి సినిమాలున్నాయి. కోదండరామిరెడ్డి మెగాస్టార్ కు అత్యంత ఎక్కువ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కావడం గమనార్హం. జగదేకవీరుడు అతిలోక సుందరి చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా గుర్తింపు పొందింది. ఎన్నో సినిమాల్లో తనదైన టాలెంట్ తో ఎదిగిన హీరో చిరు. నిన్న తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...